Asia cup 2022: అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు! గాయపడినా.. | Asia cup 2022: Fans hail Naseem Shah for braving pain and bowling despite cramps | Sakshi
Sakshi News home page

Asia cup 2022: అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు! మమ్మల్ని నిరాశ పరచలేదు!

Published Mon, Aug 29 2022 12:44 PM | Last Updated on Mon, Aug 29 2022 12:50 PM

Asia cup 2022: Fans hail Naseem Shah for braving pain and bowling despite cramps - Sakshi

ఆసియాకప్‌లో భాగంగా భారత్‌ చేతిలో పాక్‌ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు యువ పేసర్‌ నసీమ్ షా మాత్రం అభిమానుల మనసుసు గెలుచుకున్నాడు. తన టీ20 అరంగేట్ర మ్యాచ్‌లోనే నసీమ్ షా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల నసీమ్ షా తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.

భారత ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన షా.. రెండో బంతికే కేఎల్‌ రాహుల్‌ను ఔట్‌ చేసి తన జట్టుకు అద్భుతమైన శుభారంభం ఇచ్చాడు. అనంతరం సెకెండ్‌ స్పెల్‌లో తిరిగి బౌలింగ్‌కు వచ్చిన నసీమ్‌.. నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. భారత ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో తొలి బంతి వేసే క్రమంలో నసీమ్‌ షా పాదానికి గాయమైంది.

అనంతరం తన పాదాన్ని నేలపై కూడా ఉంచలేని స్థితికి చేరుకున్నాడు. అయినప్పటికీ తీవ్రమైన నొప్పిని భరిస్తూ షా తన ఓవర్‌ను పూర్తి చేశాడు. అయితే గాయం కారణంగా తన రిథమ్‌ను కోల్పోయిన నసీమ్‌ 11 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో అద్భుతమైన పోరాట పటిమను కనబరిచిన నసీమ్ షాపై సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సైతం.. నసీమ్‌ షా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. దూకుడుగా ఆడాడని.. తమను నిరాశపరచలేదని చెప్పుకొచ్చాడు.

చదవండిAsia Cup 2022: జడ్డూ నీకు నాతో మాట్లాడటం ఇష్టమేనా? మంజ్రేకర్‌ ప్రశ్నకు ఆల్‌రౌండర్‌ ఆన్సర్‌ ఇదే!


No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement