Asia Cup 2023: టీమిండియాకు ఊహించని షాక్.. స్వదేశానికి బుమ్రా | Asia Cup 2023: Jasprit Bumrah Returns Home, Set To Miss Nepal Clash | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: టీమిండియాకు ఊహించని షాక్.. స్వదేశానికి బుమ్రా

Published Sun, Sep 3 2023 9:31 PM | Last Updated on Wed, Sep 6 2023 9:23 PM

Asia Cup 2023: Jasprit Bumrah Returns Home, Set To Miss Nepal Clash - Sakshi

ఆసియా కప్-2023లో భాగంగా నేపాల్‌తో రేపు (సెప్టెంబర్‌ 4) జరగాల్సిన కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత రేపటితో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తుంది. బుమ్రా ఇప్పటికే భారత్‌కు వచ్చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

బుమ్రా స్వ‌దేశానికి వ‌చ్చేయ‌డానికి గల కారణాలు తెలియ‌డం లేదు. అయితే, బుమ్రా సూపర్‌-4 మ్యాచ్‌ల సమయానికంతా తిరిగి జట్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. ఏది ఏమైనా సూపర్‌ ఫామ్‌లో ఉన్న బుమ్రా జట్టుకు దూరం కావడం పెద్ద లోటే అని చెప్పాలి. 

ఇదిలా ఉంటే, పాకి​స్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బుమ్రా (14 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 16 పరుగులు) ఆఖర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ ముగిసాక వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement