టీమిండియాతో టీ20 సిరీస్, టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ప్రకటించింది. భారత్‌తో సిరీస్‌కు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సెలక్టెర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే టీ20 ప్రపంచకప్‌కు మాత్రం వార్నర్ ఎంపిక చేశారు. కాగా భారత పర్యటనకు వార్నర్ స్థానంలో కామెరాన్ గ్రీన్‌కు జట్టులో చోటు దక్కింది. అదే విధంగా పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా తరపున ఆంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు.
అతడిని టీ20 టీ20 ప్రపంచకప్ ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసీస్ మూడు టీ20ల సిరీస్ నిమిత్తం భారత్‌లో పర్యటించనుంది. సెప్టెంబర్ 20న మొహాలి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అదే విధంగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది.
టీ20 ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మూథ్యూ వేడ్ , డేవిడ్ వార్నర్.
భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మూథ్యూ వేడ్ , కామెరాన్ గ్రీన్
చదవండి: IND VS HK: గ్రౌండ్‌లోనే గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్.. వీడియో వైరల్!
Comments
Please login to add a commentAdd a comment