టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ క్రికెట్ జట్టు అన్ని విధాల సన్నద్దమవుతోంది. అంతేకంటే ముందు వరల్డ్‌కప్ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్ తలపడనుంది. టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధానంగా దృష్టిసారించింది.
ఈ క్రమంలో తమ జాతీయ జట్టు సభ్యులందరికీ పాకిస్థాన్ సైన్యంతో పీసీబీ కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. కాకుల్ ఆర్మీ క్యాంపులో పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదే విధంగా టీ20ల్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్‌గా బాబర్ ఆజం మళ్లీ బాధ్యతలు చేపట్టాడు.
ఏప్రిల్ 18 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో బాబర్ మళ్లీ పాక్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇక తిరిగి పాక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజం ఓ పోడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో పోడ్‌కాస్ట్ హోస్ట్ నుంచి బాబర్‌కు ఓ ప్రశ్న ఎదురైంది.
"టీ20 మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే మిగిలి ఉంది. ప్రత్యర్ధి జట్టు విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు కావాలి. మీ వద్ద రెండు బౌలింగ్ ఆప్షన్ ఉన్నాయి. ఒకరు నసీమ్ షా, మరొకరు జస్ప్రీత్ బుమ్రా.
అటువంటి అప్పుడు 10 పరుగులను కాపాడుకోవడానికి మీరు ఎవరికి బౌలింగ్ ఇస్తారన్న" ప్రశ్న హోస్ట్ అడిగాడు. బాబర్ ఏమీ ఆలోచించకుండా నసీం షా పేరును చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన భారత అభిమానులు బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలరని, నసీం షాకు అంత సీను లేదని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment