లక్నో: లక్నో సూపర్ జెయింట్స్ చెత్తగా ఆడి చిత్తుగా ఓడింది. బెంగళూరు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని తమ సొంతగడ్డపై ఎదురైన పరాజయానికి లక్నో గడ్డపై ప్రతీకారం తీర్చుకుంది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 18 పరుగులతో బెంగళూరు గెలుపొందింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డుప్లెసిస్ (40 బంతుల్లో 44; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. తర్వాత లక్నో 19.5 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది.
బెంగళూరు జట్టు తరఫున ఓపెనర్లవే పరుగులు... ఆ తర్వాత కష్టాలే! కోహ్లి (30 బంతుల్లో 31; 4 ఫోర్లు), కెపె్టన్ డుప్లెసిస్ ఆడినంత వరకు స్కోరుబోర్డు నడించింది. పవర్‌ప్లేలో 42 పరుగులే అయినా వికెట్‌ను కాపాడుకుంది. అయితే రవి బిష్ణోయ్ కోహ్లిని స్టంపౌట్ చేయడంతో 61 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ (16) మినహా ఇంకెవరూ పట్టుమని పది పరుగులైనా చేయలేదు.
లక్నో కళ్లముందున్న లక్ష్యం చిన్నది. కానీ బ్యాటర్ల నిర్లక్ష్యం జట్టును పవర్‌ప్లేలోనే ‘ఫ్లాప్’ చేసింది. మేయర్స్ (0), కృనాల్ (14), బదోని (4), దీపక్ హుడా (1)లను బెంగళూరు బౌలర్లు సిరాజ్, మ్యాక్స్‌వెల్, హాజల్‌వుడ్, హసరంగ తలా ఓ దెబ్బ తీశారు. 5.1 ఓవర్లలో 27/4 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్ (13 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మిశ్రా (30 బంతుల్లో 19; 2 ఫోర్లు) చేసిన పరుగులు లక్నోను కష్టంగా 100 దాటించాయే తప్ప లక్ష్యాన్ని చేర్చలేదు. ఫీల్డింగ్ సమయంలో కెపె్టన్ కేఎల్ రాహుల్ (0 నాటౌట్) తొడ కండరాలు పట్టేయడంతో ఓపెనింగ్ చేయలేదు. 11వ స్థానంలో వచ్చి నాటౌట్‌గా నిలిచాడంతే!
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (స్టంప్డ్) పూరన్ (బి) బిష్ణోయ్ 31; డుప్లెసిస్ (సి) కృనాల్ (బి) మిశ్రా 44; అనూజ్ (సి) మేయర్స్ (బి) గౌతమ్ 9; మ్యాక్స్‌వెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బిష్ణోయ్ 4; ప్రభుదేశాయ్ (సి) గౌతమ్ (బి) మిశ్రా 6; దినేశ్ కార్తీక్ (రనౌట్) 16; మహిపాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నవీనుల్ 3; హసరంగ (నాటౌట్) 8; కరణ్ శర్మ (సి) గౌతమ్ (బి) నవీనుల్ 2; సిరాజ్ (సి) పూరన్ (బి) నవీనుల్ 0; హాజల్‌వుడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–62, 2–75, 3–80, 4–90, 5–109, 6–114, 7–117, 8–121, 9–121. బౌలింగ్: కృనాల్ పాండ్యా 4–0–21–0, స్టొయినిస్ 1–0–11–0, నవీనుల్ హఖ్ 4–0–30–3, రవి బిష్ణోయ్ 4–0–21–2, అమిత్ మిశ్రా 3–0–21–2, యశ్ 2–0–12–0, గౌతమ్ 2–0–10–1.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) అనూజ్ (బి) సిరాజ్ 0; బదోని (సి) కోహ్లి (బి) హాజల్‌వుడ్ 4; కృనాల్ (సి) కోహ్లి (బి) మ్యాక్స్‌వెల్ 14; హుడా (స్టంప్డ్) కార్తీక్ (బి) హసరంగ 1; స్టొయినిస్ (సి) ప్రభుదేశాయ్ (బి) కరణ్ శర్మ 13; పూరన్ (సి) మహిపాల్ (బి) కరణ్ శర్మ 9; గౌతమ్ (రనౌట్) 23; బిష్ణోయ్ (రనౌట్) 5; మిశ్రా (సి) కార్తీక్ (బి) హర్షల్ 19; నవీనుల్ (సి) కార్తీక్ (బి) హాజల్‌వుడ్ 13; రాహుల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆటౌట్) 108. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–21, 4–27, 5–38, 6–65, 7–66, 8–77, 9–103, 10–108. బౌలింగ్: సిరాజ్ 3–0–24–1, హాజల్‌వుడ్ 3–0–15–2, మ్యాక్స్‌వెల్ 1–0–3–1, హసరంగ 4–0–20–1, కరణ్ శర్మ 4–0–20–2, హర్షల్ పటేల్ 3.5–0–20–1, మహిపాల్ 1–0–4–0.
ఐపీఎల్‌లో నేడు
గుజరాత్ VS ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment