సౌతాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది (2024) జరిగే అండర్ 19 వరల్డ్‌కప్ కోసంభారత యువ జట్టును ఇవాళ (డిసెంబర్ 12) ప్రకటించారు. వరల్డ్‌కప్‌తో పాటు దానికి ముందు సౌతాఫ్రికాలోనే జరిగే ట్రై సిరీస్‌కు కూడా సెలెక్టర్లు ఇవాళే ఉమ్మడి జట్టును ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్‌గా ఉదయ్ సహరన్, వైస్ కెప్టెన్‌గా సౌమీ కుమార్ పాండేను ఎంపిక చేశారు. రెగ్యులర్ జట్టుతో పాటు ట్రావెలింగ్ స్టాండ్ బైలు, బ్యాకప్ ప్లేయర్లను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. మొత్తంగా 22 మంది సభ్యుల జంబో బృందాన్ని భారత సెలెక్టర్లు ఇవాళ ప్రకటించారు.
వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 మధ్య జరిగే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జనవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. భ్లోంఫాంటీన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనంతరం భారత్.. జనవరి 25, 28 తేదీల్లో ఐర్లాండ్, యూఎస్‌ఏలతో తమ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడనుంది. మెగా టోర్నీకి ముందు యంగ్ ఇండియా.. ఇంగ్లండ్, సౌతాఫ్రికాలతో కలిసి ట్రై సిరీస్ ఆడుతుంది. ఈ టోర్నీ డిసెంబర్ 29న మొదలై వచ్చే ఏడాది జనవరి 10 వరకు సాగుతుంది.
ట్రయాంగులర్ సిరీస్, అండర్ 19 వరల్డ్‌కప్ 2024 కోసం భారత జట్టు..
ఉదయ్ సహరన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అరవెల్లి అవినాశ్ రావ్ (వికెట్‌కీపర్), ఇన్నేశ్ మహాజన్ (వికెట్‌కీపర్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ ధాస్, ప్రియాన్షు మోలియా, ముషీర్ ఖాన్, మురుగన్ అభిషేక్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారి
ట్రై సిరీస్‌కు ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్స్..
ప్రేమ్ దేవ్‌కర్, అన్ష్ గోసాయ్, మొహమ్మద్ అమాన్
బ్యాకప్ ప్లేయర్స్..
దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి విజ్ఞేశ్, కిరణ్ చోర్మలే
Comments
Please login to add a commentAdd a comment