
న్యూఢిల్లీ: కరోనా అడ్డంకులను దాటుకుని అభిమానులకు వినోదం పంచుతున్న ఐపీఎల్-2020 కి తోడుగా మహిళల మినీ ఐపీఎల్ సంరంభం త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం కీలక ప్రకటన చేసింది. యూఏఈలోని షార్జా వేదికగా జరిగే ‘మహిళల టి20 చాలెంజర్ టోర్నీ’ జట్లకు సారథులను నియమించింది. సూపర్ నోవాస్ టీమ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రయల్ బ్లేజర్స్ టీమ్‌కు స్మృతి మంధాన, వెలాసిటీ టీమ్‌కు మిథాలి రాజ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని పేర్కొంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్ నవంబర్ 4 నుంచి 9 వరకు జరుగనుంది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రియా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటారు. కాగా, 2018 లో మొదలైన మహిళల మినీ ఐపీఎల్‌లో తొలుత సూపర్ నోవాస్, వెలాసిటీ జట్లు మాత్రమే ఉండేవి. ఈసారి ట్రయల్ బ్లేజర్స్ టీమ్‌ని కొత్తగా చేర్చారు.
(చదవండి: మహిళా క్రికెటర్లకు పిలుపు!)
(చదవండి: ‘క్వారంటీన్ నిబంధనలు మారవు’)
Comments
Please login to add a commentAdd a comment