Kohli Fans Troll BCCI For 'Thank You' Tweet About Virat Kohli, Deets Inside In Telugu - Sakshi
Sakshi News home page

Virat Kohli: అబ్బో ఇంత తొందరగా.. ఇప్పుడే తెల్లారిందా మీకు! తనే మాకు కింగ్‌!

Published Fri, Dec 10 2021 11:44 AM | Last Updated on Fri, Dec 10 2021 12:17 PM

BCCI Lauds Virat Kohli For His Stint As India ODI Skipper A Day Later Fans Not Happy - Sakshi

PC: BCCI

Fans Trolled BCCI For "Thank You" Tweet About Virat Kohli: భారత క్రికెట్‌ జట్టులో జరిగిన కీలక మార్పుల గురించి ‍క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. విరాట్‌ కోహ్లిని కాదని.. రోహిత్‌ శర్మకు వన్డే కెప్టెన్సీ అప్పగించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్రికెటేతర కారణాల వల్లే కోహ్లికి ఉద్వాసన పలికారని అంటై విమర్శలు వెల్లువెత్తగా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్వయంగా రంగంలోకి దిగడం విశేషం. విరాట్‌ కోహ్లి టి20 కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే వన్డే సారథిగా కూడా అతడిని తొలగించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

ఈ నేపథ్యంలో... వన్డే కెప్టెన్సీనుంచి తొలగించిన రోజు కోహ్లి ఘనతల గురించి ఏమాత్రం ప్రస్తావించని బీసీసీఐ ఒక రోజు తర్వాత దీనిపై స్పందించడం గమనార్హం. తమ ట్విట్టర్‌ అకౌంట్‌లో ‘పట్టుదల, పోరాటతత్వం, అంకితభావంతో జట్టును నడిపించిన నాయకుడు’ అంటూ అతని ఫోటో పెట్టి కృతజ్ఞతలు తెలిపింది. దీంతో పాటు రెండు వీడియోలు కూడా పోస్ట్‌ చేయడం విశేషం. 2017 జనవరిలో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన తొలి వన్డేలో చేసిన సెంచరీ (పునేలో ఇంగ్లండ్‌పై 122 పరుగులు), 2018లో గువహటిలో వెస్టిండీస్‌పై 107 బంతుల్లో చేసిన 140 పరుగుల వీడియోలను ఇందులో పెట్టింది.

అయితే, ఫ్యాన్స్‌ మాత్రం బీసీసీఐ తీరును తప్పుబడుతున్నారు. ‘‘టీ20 ఫార్మాట్‌కు ఒక కెప్టెన్‌.. వన్డేలకు ఒక కెప్టెన్‌ ఉండాలని రూల్‌ ఉందా! ఒకవేళ జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నా.. కోహ్లికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇంత సమయం పట్టిందా! ఇప్పుడే మీకు తెల్లారిందా! ఇలా ఆలస్యంగా పోస్టు పెట్టడం చూస్తుంటేనే మీ మనసులో ఉన్న ఉద్దేశాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఏదేమైనా మా కోహ్లి కింగ్‌.. ఎల్లప్పటికీ తనే కింగ్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement