Ben Stoke's Golden Reaction Goes Viral as England Smash Boundary on First Ball - Sakshi
Sakshi News home page

Ashes 2023: తొలి బంతికే ఫోర్‌ కొట్టిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌.. కెప్టెన్‌ స్టోక్స్‌ రియాక్షన్‌ వైరల్‌

Published Fri, Jun 16 2023 7:20 PM | Last Updated on Fri, Jun 16 2023 7:52 PM

Ben Stokes Golden Reaction Goes Viral As England Smash Boundary On First Ball - Sakshi

ఎడ్జ్‌బాస్టన్‌  వేదికగా ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కెప్టెన్‌ నిర్ణయం తగ్గట్టుగానే ఇం‍గ్లీష్‌ బ్యాటర్లు ఆడుతున్నారు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో 'బాజ్‌బాల్'ను విధానాన్ని అవలంబిస్తున్న ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. వన్డే తరహాలో ఇంగ్లండ్‌ ఆడుతోంది. ప్రస్తుతం క్రీజులో జోరూట్‌(38), జానీ బెయిర్‌స్టో(2) పరుగులతో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్‌ జాక్‌ క్రాలీ(61) పరుగులతో రాణించాడు.

తొలి బంతికే ఫోర్‌
కాగా ఇంగ్లండ్‌ తమ ఇన్నింగ్స్‌ను ఫోర్‌తో ప్రారంభించింది. ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ ‍కమ్మిన్స్‌ వేసిన మొదటి ఓవర్‌లో తొలి బంతిని ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్ క్రాలే బౌండరీకి తరలించాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని సెకన్ల వ్యవధిలో క్రాలీ బౌండరీగా మలిచాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌.. క్రాలీ కొట్టిన షాట్‌ను చూసి వావ్‌ అని షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సిరీస్‌లో కామెంటేర్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌.. బెన్‌ స్టోక్స్‌ రియాక్షన్‌పై స్పందించాడు. జాక్‌ క్రాలీ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విధానం.. స్టోక్స్‌ ఒక్కడికే కాకుండా అందరిని ఆచ్చర్యపరిచింది. ఆసీస్‌ మాత్రం నిరాశలో ఉంటుందని కార్తీక్‌ ట్విట్‌ చేశాడు.
చదవండి: ఆసీస్‌తో సిరీస్ నా చివరిదని భార్యకు చెప్పా.. చాలా కష్టంగా ఉండేది: అశ్విన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement