
దుబాయ్: భారత క్రికెట్ బంగారం, చెన్నై సూపర్ కింగ్స్ విజయవంతమైన సారథి ధోనికి ఫ్రాంచైజీ బంగారు టోపీని బహూకరించింది. ‘తలా’గా చెన్నైని ఊపేస్తున్న ఈ ‘మిస్టర్ కూల్’ పదేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ పదేళ్లలో మూడుసార్లు (2010, 2011, 2018) టైటిల్‌తో చెన్నైని ‘సూపర్ కింగ్స్’గా నిలిపాడు. తమ జట్టును పదేళ్లు (మధ్యలో సీఎస్‌కేను రెండేళ్లు నిషేధించారు) నడిపించిన నాయకుడు ధోనికి ఫ్రాంచైజీ బంగారు టోపీతో పట్టం కట్టింది. ఫ్రాంచైజీ అంతర్గత అవార్డుల వేడుక అబుదాబిలో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment