టీమిండియా యువ ఆటగాడు.. సీఎస్‌కే స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రసంశల వర్షం కురిపించాడు. సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ శుక్రవారం 18 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తుండగా.. రుతురాజ్ గైక్వాడ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేతన్ శర్మ రుతురాజ్‌పై స్పందించాడు.
చదవండి: Virat Kohli- KL Rahul: కోహ్లి కెప్టెన్సీలో 108 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రాహుల్
''రుతురాజ్ గైక్వాడ్ టీమిండియాలో వండర్స్ చేయగలడు.ఐపీఎల్, విజయ్ హజారే ట్రోఫీ ఇలా ఏది చూసుకున్నా తన శైలిలో బ్యాటింగ్ కొనసాగిస్తూ అందరిని ఆకట్టుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూనే బ్యాట్స్‌మన్‌గా సెంచరీలు మీద సెంచరీలు బాదేశాడు. ఫలితం అతను ఈరోజు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. 18 మందిలో అతనికి చోటు దక్కింది. అయితే తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది మా చేతుల్లో ఉండదు. కానీ అతని అవసరం టీమిండియాకు ఉంది. భవిష్యత్తులో టీమిండియాలో స్టార్ బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతాడు. ఓపెనింగ్ కాంబినేషన్‌లో రుతురాజ్‌ను ఆడిస్తే టీమిండియా బెస్ట్ ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: Devon Conway: గాయం నుంచి తిరిగొచ్చాడు.. 2022లో తొలి సెంచరీ బాదాడు
ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్‌కే తరపున ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపాడు. 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో తన విశ్వరూపం ప్రదర్శించాడు. 5 మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాది ఔరా అనిపించాడు. అంతేకాదు ఈ ట్రోఫీలో రుతురాజే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం ఐదు మ్యాచ్‌లాడిన రుతురాజ్ 603 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. రుతురాజ్ ప్రదర్శనపై ముచ్చటపడిన అభిమానులు జట్టులోకి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రుతురాజ్ గతేడాది జూలైలో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ ద్వారా టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
చదవండి: Ruturaj Gaikwad: సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్.. తాజా ఫీట్‌తో కోహ్లి సరసన
Comments
Please login to add a commentAdd a comment