లార్డ్స్ వేదికగా యాషెస్ రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరాజయం పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ విరోచిత పోరాటం అందరిని అకట్టుకుంది. 371 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మిగితా బ్యాటర్లంతా విఫలమైనప్పటికీ.. స్టోక్స్ మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు.
తొలుత నెమ్మదిగా తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టోక్స్.. బెయిర్ స్టో రనౌట్ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా 56 ఇన్నింగ్స్ వేసిన కామెరూన్ గ్రీన్‌కు స్టోక్స్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్‌లో స్టోక్స్ 3 సిక్స్‌లు, ఫోర్‌తో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు.
ఓ దశలో జట్టును గెలిపించేలా కన్పించిన ఇంగ్లీష్ కెప్టెన్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓవరాల్‌గా 214 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ 155 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్‌పై సర్వాత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేరాడు. స్టోక్స్‌ను టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్‌తో మంజ్రేకర్ పోల్చాడు. "తీవ్రమైన ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో స్టోక్స్‌కు బాగా తెలుసు. భారత్‌లో రిషభ్ పంత్ కూడా అచ్చం స్టోక్స్‌లాగే ఒత్తిడిలో అద్భుతంగా ఆడుతాడు అని ట్విటర్‌లో మంజ్రేకర్ పేర్కొన్నాడు.
చదవండి: ఐపీఎల్-2024లో ఆడనున్న పాకిస్తాన్ బౌలర్.. అది ఎలా అంటే?
Comments
Please login to add a commentAdd a comment