ఐపీఎల్‌లో సీఎస్‌కే మాజీ సారధి ఎంఎస్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని సీఎస్‌కే హెడ్ కోచ్ ష్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం పునరుద్ఘాటించాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విషయం చాలా మందికి ముందే తెలిసినప్పటికీ.. తనకు మాత్రం ఆలస్యంగా తెలిసిందని కాశీ విశ్వనాథ్ వాపోయాడు.
ధోని ఏ నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని, అది తమ జట్టుకు మంచే చేస్తుందని కాశీ విశ్వనాథ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోని 2023 సీజన్‌లో కంటే ఈ సీజన్‌లోనే ఎక్కువ ఫిట్‌గా కనిపిస్తున్నాడని కితాబునిచ్చాడు. ధోని ఈ సీజన్‌తో పాటు మున్ముందు జరిగే సీజన్లలోనూ సీఎస్‌కేతోనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో సీఎస్‌కే నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. కెప్టెన్సీ విషయాన్ని ధోని తనకు గత సీజన్‌కు ముందు చెప్పాడని తెలిపాడు. ధోని గత సీజన్‌లోనే తనతో పరోక్ష కెప్టెన్సీ చేయించాడని పేర్కొన్నాడు. గత సీజన్ చివర్లో తాను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నట్లు వెల్లడించాడు. కెప్టెన్సీ చేపట్టే విషయంలో ధోని తనలో మానసిక స్థైర్యాన్ని నింపాడని తెలిపాడు.
కాగా, లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ నూతన కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రుతురాజ్ బాధ్యతలు చేపట్టాడు.
మరికొద్ది గంటల్లో (మార్చి 22, రాత్రి 7:30 గంటలు) ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
తుది జట్లు (అంచనా):
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్
Comments
Please login to add a commentAdd a comment