kasi viswanath
-
IPL 2024: ధోని ఆటగాడిగా కొనసాగడంపై బిగ్ అప్డేట్
ఐపీఎల్లో సీఎస్కే మాజీ సారధి ఎంఎస్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని సీఎస్కే హెడ్ కోచ్ ష్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం పునరుద్ఘాటించాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విషయం చాలా మందికి ముందే తెలిసినప్పటికీ.. తనకు మాత్రం ఆలస్యంగా తెలిసిందని కాశీ విశ్వనాథ్ వాపోయాడు. ధోని ఏ నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని, అది తమ జట్టుకు మంచే చేస్తుందని కాశీ విశ్వనాథ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోని 2023 సీజన్లో కంటే ఈ సీజన్లోనే ఎక్కువ ఫిట్‌గా కనిపిస్తున్నాడని కితాబునిచ్చాడు. ధోని ఈ సీజన్‌తో పాటు మున్ముందు జరిగే సీజన్లలోనూ సీఎస్కేతోనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో సీఎస్కే నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. కెప్టెన్సీ విషయాన్ని ధోని తనకు గత సీజన్‌కు ముందు చెప్పాడని తెలిపాడు. ధోని గత సీజన్లోనే తనతో పరోక్ష కెప్టెన్సీ చేయించాడని పేర్కొన్నాడు. గత సీజన్ చివర్లో తాను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నట్లు వెల్లడించాడు. కెప్టెన్సీ చేపట్టే విషయంలో ధోని తనలో మానసిక స్థైర్యాన్ని నింపాడని తెలిపాడు. కాగా, లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ నూతన కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రుతురాజ్ బాధ్యతలు చేపట్టాడు. మరికొద్ది గంటల్లో (మార్చి 22, రాత్రి 7:30 గంటలు) ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
IPL 2024: ధోని అభిమానులకు శుభవార్త! కీలక అప్డేట్
CSK CEO Kasi Viswanathan On MS Dhoni IPL future: మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో ఐపీఎల్ సీజన్ ఆడతాడా? గతేడాది నుంచి తలైవా అభిమానులను వేధిస్తున్న మిలియన్ డాలర్ ప్రశ్న. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదోసారి ట్రోఫీ అందించాడు ధోని. నిజానికి.. ఐపీఎల్-2022లోనే తన వారసుడిగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ప్రకటించి.. పగ్గాలు అప్పగిస్తే ఫలితం శూన్యం కావడంతో మళ్లీ తనే సారథిగా బాధ్యతలు చేపట్టాడీ ఈ ‘జార్ఖండ్ డైనమైట్’. తనదైన మార్కుతో ఈ ఏడాది మరోసారి సీఎస్కేను చాంపియన్‌గా నిలిపాడు. వేధిస్తున్న మోకాలి నొప్పి మరి ఐపీఎల్-2024లోనూ ధోని ఇదే దూకుడును కొనసాగించగలడా? మోకాలి నొప్పి నుంచి కోలుకుని జట్టును మరోసారి ముందుండి నడిపిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలో జరిగిన జూనియర్ సూపర్ కింగ్స్ ఈవెంట్ లాంచ్ సందర్భంగా ధోని ఐపీఎల్ భవితవ్యంపై ప్రశ్న ఎదురుకాగా.. ‘‘నాకు ఆ విషయం గురించి తెలియదు. కెప్టెన్‌గా ఆయన తనంతట తానే ఈ విషయాన్ని నేరుగా అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాడు. పది రోజుల్లో నెట్స్‌లో ప్రాక్టీస్ తను ఆడతాడా లేదా అన్న విషయం గురించి ఇంతవరకు ఏమీ చెప్పలేదు. తను ఏం అనుకుంటే అదే చేస్తాడు. ప్రస్తుతం ధోని ఫిట్‌గానే ఉన్నాడు. రిహాబిలిటేషన్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నాడు. ఇంకో పది రోజుల్లో ధోని నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది’’ అని కాశీ విశ్వనాథ్.. తలైవా అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాగా ఐపీఎల్-2024 వేలం సందర్భంగా సీఎస్కే కొత్తగా ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024 వేలంలో సీఎస్కే కొన్న ఆటగాళ్లు వీరే 1. రచిన్ రవీంద్ర (రూ.1.8 కోట్లు) 2. శార్దూల్ ఠాకూర్ (రూ.4 కోట్లు) 3. డారిల్ మిచెల్ (రూ.14 కోట్లు) 4. సమీర్ రిజ్వీ (రూ.8.4 కోట్లు) 5. ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ.2 కోట్లు) 6. అవనీష్ రావు అరవెల్లి (రూ.20 లక్షలు). రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చహర్, ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, మిచెల్ శాంట్నర్, మతీషా పతిరణా, సుబ్రాన్షు సేనాపతి. రిలీజ్ చేసిన ప్లేయర్లు డ్వేన్ బ్రావో, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, ఎన్. జగదీశన్, సి.హరి నిశాంత్, కె.భగత్ వర్మ, కె.ఎం.ఆసిఫ్, అంబటి రాయుడు(రిటైర్డ్), రాబిన్ ఊతప్ప (రిటైర్డ్). చదవండి: IPL 2024: ముస్తాబాద్ నుంచి ఐపీఎల్ దాకా.. సీఎస్కేకు ఆడే ఛాన్స్! -
ధోని చాలా గ్రేట్.. తన సమస్య గురించి ఎవరికీ చెప్పలేదు! ఆఖరికి
ఐపీఎల్-2023 ఛాంపియన్స్‌గా ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ విజయంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు అందుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును సీఎస్కే సమం చేసింది. సీఎస్కేకు ఇది ఐదో ఐపీఎల్ టైటిల్. ఇక సీఎస్కే ఐదో సారి చాంపియన్స్‌గా నిలవడంలో ఆ జట్టు కెప్టెన్ ఎంస్ ధోనిది కీలక పాత్ర. ఈ ఏడాది సీజన్లో ధోని మోకాలి గాయంతో బాధపడతున్నప్పటికీ.. ఒక్క మ్యాచ్‌కు దూరం కాకుండా తన జట్టును ముందుకు నడిపించాడు. అయితే ఐపీఎల్ ముగిశాక తన మెకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక ఇదే విషయంపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తాజాగా స్పందించాడు. ధోని తన గాయం గురించి తమతో ఎప్పుడూ పెద్దగా చర్చించలేదని విశ్వనాథన్ తెలిపాడు. "ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఒక్క మ్యాచ్‌కు కూడా దూరం కాలేదు. జట్టు పట్ల అతడికి ఉన్న నిబద్ధత అటువంటింది. అతడి లీడర్ షిప్లో మా జట్టు ఎలా ముందుకు వెళ్తుందో అందరికీ తెలుసు. అతడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన లీడర్. అయితే మేము కూడా ఏరోజు అతడిని ఆడాలనుకుంటున్నావా లేదా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నవా అని అడగలేదు. ఎంఎస్‌కు మరి కష్టంగా ఉంటే అతడే మాతో చెప్పేవాడు. ఫైనల్ మ్యాచ్ వరకు అతడు తన గాయం గురించి మాకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఆఖరికి ఫైనల్ మ్యాచ్ తర్వాత తన మోకాలికి సర్జరీ చేసుకున్నాడు. అతడి సర్జరీ సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వనాథన్ పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2023: భారత్- పాక్ మ్యాచ్‌లు జరుగకపోతే అంతే సంగతులు! ఈ ‘చెత్త విధానం’ వల్ల.. -
ధోని మోకాలి ఆపరేషన్ సక్సెస్
చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని మోకాలికి ఇవాళ (జూన్ 1) జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో నేటి ఉదయం ధోనికి సర్జరీ జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ధోని ఫిట్‌గా ఉన్నాడని, మరో రెండు రోజుల పాటు అతను ఆసుపత్రిలోనే ఉంటాడని పేర్కొన్నారు. సర్జరీ అనంతరం తాను ధోనితో మాట్లాడానని.. శస్త్రచికిత్స గురించి వివరించలేను కానీ అది కీ-హోల్ ఆపరేషన్ అని మాత్రం చెప్పగలనని వివరించారు. మొత్తంగా ధోనికి జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని తెలిపారు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023లో మహీ మోకాలి సమస్యతో బాధపడిన విషయం తెలిసిందే. సీఎస్కే టైటిల్ గెలిచిన 48 గంటల్లోనే ధోని ఆసుపత్రిలో చేరాడు. తాజాగా శస్త్ర చికిత్స సైతం విజయవంతంగా పూర్తి చేసుకుని మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నాడు. గతంలో టీమిండియా యువ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు ఆపరేషన్ చేసిన స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్షా పార్దివాలానే ధోని సైతం (41) సర్జరీ చేశారు. ఆసుపత్రిలో ధోనితో పాటు అతని భార్య సాక్షి ఉన్నారు. ఇదిలా ఉంటే, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్స్‌లో ధోని సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాహా (54), సాయి సుదర్శన్ (96) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. ఛేదనలో సీఎస్కే 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. రుతురాజ్ (26), కాన్వే (47), శివమ్ దూబే (32 నాటౌట్), రహానే (27), రాయుడు (19), జడేజా (15 నాటౌట్) తలో చేయి వేసి సీఎస్కేను గెలిపించారు. చదవండి: ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్ బోర్డు.. జెర్సీ స్పాన్సర్ చేసే నాథుడే లేడా..? -
అసాధ్యమైన అద్భుతాన్ని సుసాధ్యం చేసిన గొప్ప వ్యక్తి రాజమౌళి
-
చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. కెప్టెన్ ఎవరంటే..?
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్లో జట్టు కెప్టెన్ ఎవరనే విషయమై ఫ్రాంచైజీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. వచ్చే సీజన్లో కెప్టెన్‌గా ఎంఎస్ ధోనినే కొనసాగుతాడని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఆదివారం మరోసారి స్పష్టం చేశాడు. సీఎస్కేను నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనిపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతని సారధ్యంలోనే సీఎస్కే మరోసారి బరిలో నిలువనుందని కాశీ విశ్వనాథ్ వెల్లడించాడు. కాగా, 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు సీఎస్కే తొలిసారి కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. ధోని ఇష్టపూర్వకంగా సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్సీ వరించింది. అయితే జడ్డూ కెప్టెన్సీ భారాన్ని హ్యాండిల్ చేయలేకపోవడంతో యాజమాన్యం తిరిగి ధోనినే జట్టు భారం మోయవలసిందిగా కోరింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధోని మరోసారి సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అప్పటికే గత సీజన్లో సీఎస్కేకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి మ్యాచ్‌ల్లో ధోని కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ.. సీఎస్కే తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, కెప్టెన్‌గా సీఎస్కే యాజమాన్యం ధోనినే ప్రకటించినప్పటికీ.. వయసు పైబడిన రిత్యా అతను లీగ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. గత రెండు సీజన్లుగా ఈ విషయమై ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంది. ధోనికి ఇష్టం లేకపోయిన బలవంతంగా అతనిపై కెప్టెన్సీ భారాన్ని మోపుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ధోని ఐదోసారి జట్టును ఛాంపియన్‌గా నిలిపి ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌పుల్ కెప్టెన్‌గా కెరీర్ ముగించాలని భావిస్తున్నాడని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయమై ధోని క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. యువ పేసర్‌కు అనారోగ్యం -
తూచ్.. రిటైర్ కావట్లేదు.. రిటైర్మెంట్ ప్రకటనపై వెనక్కు తగ్గిన రాయుడు
Ambati Rayudu Deletes Retirment Tweet: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు.. రిటైర్మెంట్ (ఐపీఎల్) విషయంలో మనసు మార్చుకున్నట్లున్నాడు. ఈ సీజన్ (2022) తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (మే 14) ఉదయం ట్వీట్ చేసిన రాయుడు.. నిమిషాల వ్యవధిలో ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. రాయుడు ఇచ్చిన ఈ ట్విస్ట్‌తో అభిమానులు కన్ఫ్యూజన్లో పడిపోయారు. రాయుడు రిటైర్మెంట్పై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందించాడు. రాయుడు రిటైర్ కావట్లేదని క్లారిటీ ఇచ్చాడు. గత కొంత కాలంగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నానన్న బాధలో రాయుడు ఉన్నాడని, ఆ నిరాశలోనే అతను రిటైర్మెంట్ ప్రకటన చేశాడని, వచ్చే సీజన్ కూడా రాయుడు తమతోనే ఉంటాడని వివరణ ఇచ్చాడు. 36 ఏళ్ల రాయుడు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 12 మ్యాచ్‌ల్లో 27.10 సగటున 271 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో సంతృప్తి చెందకనే రాయుడు రిటైర్మెంట్ ప్రకటన చేసినట్లు సీఎస్కే సీఈవో పేర్కొన్నాడు.రాయుడు తన ట్వీట్లో ఈ విధంగా స్పందించాడు. 'ఐపీఎల్లో ఇదే నా ఆఖరు సీజన్ అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున తన 13 ఏళ్ల ఐపీఎల్ ప్రస్థానం చాలా సంతృప్తిని ఇచ్చింది.. ఆ రెండు జట్లతో గొప్ప క్షణాలు గడిపాను.. ముంబై, సీఎస్కేకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (2010-2017), సీఎస్కే (2018 నుంచి) జట్లకు ప్రాతినిధ్యం వహించిన రాయుడు.. 187 మ్యాచ్‌ల కెరీర్లో 127.26 స్ట్రైయిక్ రేట్‌తో 29.28 సగటున 4187 పరుగులు చేశాడు. 2022 మెగా వేలంలో సీఎస్కే రాయుడుని 6.75 కోట్లకు తిరిగి దక్కించుకుంది. ఈ సీజన్లో సీఎస్కే తరఫున రుతురాజ్ (313 పరుగులు), శివమ్ దూబే (289) తర్వాత అత్యధిక పరుగులు చేసింది రాయుడే (271) కావడం విశేషం. చదవండి: సీఎస్కే షాకిచ్చిన స్టార్ క్రికెటర్.. అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటన -
చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ఓపెనర్ వచ్చేశాడు!
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్! గాయంతో బాధపడుతున్న యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతడు తిరిగి జట్టులోకి చేరాడు. తొలుత గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు రుత్‌రాజ్ గైక్వాడ్ దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో రుతురాజ్ గైక్వాడ్ ఉత్తీర్ణత సాధించనట్లు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. దీంతో అతడు డెవాన్ కాన్వేతో ఓపెనింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. "రుతురాజ్ పూర్తిగా గాయం నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతడు జట్టులతో చేరి తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. అదే విధంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు" అని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. మరో వైపు ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ వీసా సమస్య కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మార్చి 26నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: ICC Women’s World Cup 2022: పాకిస్తాన్ సంచలన విజయం.. పదమూడేళ్ల తర్వాత తొలిసారి! -
ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
చెన్నై: నిన్న(జులై 7) తమ ఆరాధ్య క్రికెటర్ 40వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న ధోనీ అభిమానులకు.. రోజు తిరక్కుండానే మరో తీపికబురు అందింది. మహేంద్రుడు మరో రెండేళ్లపాటు సీఎస్కేలో కొనసాగుతాడని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించడంతో ధోనీ అభిమానులు సహా సీఎస్కే ఫ్యాన్స్ ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ను ఇండియన్ కలర్స్‌లో చూడలేకపోయినా.. కనీసం మరో రెండేళ్లు ఫీల్డ్‌లో చూసే అవకాశం దక్కనుందని ఉబ్బితబ్బి అవుతున్నారు. ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ధోనీకి మరో రెండేళ్ల పాటు క్రికెట్ ఆడగలిగే సత్తా ఉందని, ప్రస్తుతం అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడని పేర్కొన్నాడు. ధోనీ క్రికెట్లో కొనసాగకపోవడానికి ఎలాంటి కారణం లేదని, అతను ఫిట్‌గా ఉన్నంతకాలం సీఎస్కేతో ట్రావెల్ చేస్తాడని ఆయన స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ధోనీ అందించిన సేవల పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని, సీఎస్కేకు అతని అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఐపీఎల్లో ప్లేయర్‌గా పెద్దగా రాణించలేకపోయిన మహేంద్రుడు.. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. కరోనా కారణంగా టోర్నీ అర్ధంతరంగా ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో చెన్నైను రెండో స్థానంలో నిలిపాడు. ప్రస్తుతం ధోనీ ఫామ్ లేమితో సతమతమవుతున్నప్పటికీ .. చెన్నై జట్టు మాత్రం ఇప్పటికీ అతని సామర్థ్యంపై నమ్మకం ఉంచి అతనికి అవకాశాలు కల్పిస్తూనే ఉంది. -
హత్య కేసులో టీడీపీ నాయకుడి అరెస్ట్
పిడుగురాళ్ల: గుంటూరుజిల్లాలో జరిగిన ఓ హత్యకేసులో టీడీపీ నాయకుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పిడుగురాళ్లకు చెందిన టీడీపీ సర్పంచ్ భర్త కాశీ విశ్వనాధ్ తన వ్యాపార భాగస్వామి అయిన కరీంను అత్యంత దారుణంగా హతమార్చి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే....పిడుగురాళ్లకు చెందిన సయ్యద్ కరీం ఆరు నెలల క్రితం హత్యకు గురయ్యాడు. కరీం మృతికి సంబంధించి అనుమానాలున్నాయని ఆయన భార్య షెహనాజ్ రూరల్ ఎస్పీని ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కరీం మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కరీం చనిపోవడానికి ముందు అతను తాగిన మద్యంలో విషం కలిసి ఉందని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. కరీం మృతికి ముందు తన వ్యాపార భాగస్వామి అయిన కాశీ విశ్వనాధ్‌తో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా మర్డర్ మిస్టరీ వీడింది. తన వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన కరీం నూతనంగా బయో కెమికల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కరీం ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే.. తనకు ఇబ్బందితో పాటు వ్యాపార రహస్యాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో అతని చంపాలని విశ్వనాధ్ కుట్రపన్నాడు. అందులో భాగంగా కరీంకు మద్యంలో విషం కలిపి తాగించాడు. విశ్వనాధ్‌తో పాటు 8మంది నిందితులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బాలచందర్ స్ఫూర్తితో దర్శకుడినయ్యా ..
ద్వారకాతిరుమల : సినీ దర్శక దిగ్గజం బాలచందర్‌ను చూసి స్ఫూర్తి పొంది సినీ రంగంలోకి ప్రవేశించానని దర్శకుడు, నటుడు కాశీవిశ్వనాథ్ అన్నారు. ద్వారకాతిరుమల చినవెంకన్నను మంగళవారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తనది తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం అని, రైతు కుటుంబంలో జన్మించానని చెప్పారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లో తమ గ్రామంలో దర్శకుడు బాలచందర్ చిత్రీకరణలో తొలి కూడి కోసింది చిత్రం షూటింగ్ జరిగిందని, బాలచందర్‌ను చూసి దర్శకుడు కావాలని అప్పుడే నిర్ణయించుకున్నానన్నారు. 15 ఏళ్ల నుంచి తాను సినీ పరిశ్రమలో ఉన్నానని, నువ్వులేక నేనులేను చిత్రంతో దర్శకుడిగా, నచ్చావులే చిత్రంతో నటుడిగా పరిచయమయ్యానన్నారు. ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తున్నానని చెప్పారు. విభిన్న పాత్రలు పోషించేందుకు ప్రయత్నిస్తున్నానని విశ్వనాథ్ అన్నారు. -
అక్షరమై వెలిగి.. చిరునవ్వై మిగిలి...
ఆయన కలం బలం ఎంత గొప్పదో చెప్పడానికి ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రంలో నటుడు నూతన ప్రసాద్ చేత పలికించిన ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు ... లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, బ్యాక్ నుంచి వరదలు, ఫ్రంట్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి’ అనే డైలాగు ఒక్కటి చాలు. ఇది మచ్చుతునక మాత్రమే. ఇవి కేవలం డైలాగులు కావు. అవధుల్లేని జలధి వంటి జీవితంలో మునిగితేలిన ఓ మేటి నావికుడు బతుకు లోతుల్లో నుంచి వెలికి తీసి పదిమందికి పంచిన ఆణిముత్యాలు. విశాఖపట్నం : జీవితాన్ని భిన్న కోణాల్లో దర్శించి, ఎంతో మధనపడి, ఆలోచించి, ఆవేశపడి, అనుభవాల అక్షయతూణీరంలో నుంచి సంధించిన అక్షరాస్త్రాలు, హాస్య తుషారాలు కాశీవిశ్వనాథ్ రచనలు. సినీ రచయిత కాశీవిశ్వనాథ్ లేకపోయినా ఆయన రచనలు పెదాలపై నవ్వులను విరబూయిస్తూనే ఉంటాయి. ఆయన ఆలోచనలు రంగస్థలంపై రసావిష్కరణకు తెర తీశాయి. వెండి తెరపై తళుక్కున మెరిశాయి. రంగస్థల రచయితగా, నటుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రఖ్యాతి పొందిన కాశీవిశ్వనాథ్ జీవితమే అక్షరమై వెలిగింది. వన్‌టౌన్ ఏరియాలో పుట్టి పెరిగిన కాశీ విశ్వనాథ్‌కు విశాఖ అంటే ఎంతో ప్రేమ. తెలుగు సినిమా రంగంలో చీఫ్ టెక్నీషియన్ హోదాలో హైదరాబాద్‌లో సదుపాయాలు పొందే అవకాశం ఉన్నా ఆయన విశాఖనే శాశ్వత చిరునామాగా చేసుకొన్నారు. చదువుకొన్న ఏవీఎన్ కశాశాల అన్నా, ఉద్యోగం ఇచ్చిన పోర్టు అన్నా ఎంతో మమకారమని చెప్పే అయన విశాఖ మీద ప్రేమతో ఇసాపట్నం పేరిట 20 కథల సంకలనాన్ని ప్రచరించారు. సినీ రచనపై రైటర్స్ వర్క్‌షాపును కూడా ఆయన విశాఖలోనే నాలుగేళ్ల క్రితం నిర్వహించి 56 మందికి శిక్షణ ఇచ్చారు. కాశీవిశ్వనాథ్ రచనలకు స్ఫూర్తి రావిశాస్త్రి. పోర్టులో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తూ క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన విశ్వనాథ్ రావిశాస్త్రికి ఏకలవ్య శిష్యుడుగా ప్రాచుర్యం పొందారు. ఒక దీపం వెలిగింది నాటికకు రావిశాస్త్రి ముందుమాట రాసి విశ్వనాథ్‌ను ప్రోత్సహించారు. తన జీవిత కాలంలో 131 సినిమాలకు కథ, మాటలు రాసి 52 సినిమాల్లో నటించిన కాశీవిశ్వనాథ్ బుల్లితెరపైనా తన ముద్ర వేశారు. నాటకాలే నిచ్చెనగా సినీ ప్రస్థానం : కాశీ విశ్వనాథ్‌కు నాటికలే ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చాయి. నాటకం నా మనస్సును నింపితే..సినిమా నా కడుపు నింపిందనేవారు. కదిలిపోతున్న కాలంలో గాలికి ఎగిరిపోకుండా నిలబడిన నాటికలు, నాటకాలు సుమారు 35 వరకు రాశారు. హాస్యనటుడు రాజుబాబు 70వ దశకంలో మద్రాసు వాణిమహల్లో తన జన్మదినోత్సవాన్ని వైభవంగా జరుపుకొన్నారు. ఆ ఉత్సవాల్లో నవోదయ కళానికేతన్ తరుపున ఒక దీపం వెలిగింది, మనస్సున్న మనిషి అనే నాటకాల్ని విజయవంతంగా ప్రదర్శించడంతో సినిమా ప్రముఖల దృష్టిని ఆకర్షించారు. రచనలే కాదు ఆటల్లోను యోధుడే : కాశీ విశ్వనాథ్ కేవలం రచనలు, మాటల మనిషి కాదు..ఆటల యోధుడు కూడా. మూడు పర్యాయాలు వెయిట్ లిప్టింగ్లో ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ చాంపియన్ ఆయన. 1964లో సిలోన్లో, 68లో కలకత్తాలో, 69లో హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థిగా ఛాంపియన్షిప్ సాధించిన విశ్వనాథ్ 72లో జూనియర్ నేషనల్ చాంపియన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన విశాఖ పోర్టులో జిమ్నాజియమ్ ఏర్పాటుకు బీజాలు వేసి అందులో పార్ట్‌టైమ్ కోచ్‌గా చాలా మందికి శిక్షణ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. రచనలు : కథా రచన వల్ల క్లుప్తత, నవల వల్ల చిత్రానువాదం, నాటకాల వల్ల పాత్రోచిత సంభాషణ రాయడంలో కాశీవిశ్వనాథ్ దిట్ట. ఆయన సాహిత్య నేపథ్యంలో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో (నేనూ మా ఆవిడ), విజయబాపినీడు(మగమహారాజు), మౌళి (పట్నం వచ్చిన పతివ్రతలు) వంటి దర్శకుల మొదటి చిత్రాలకు కాశీ విశ్వనాథ్ రచనలు చేయడం ఆ సినిమాలు ఘన విజయం సాధించడం ఆయనకు ఒక అనుభూతినిచ్చాయి. కాశీవ్వినాథ్ కలం ఎంతో బలం. రావిశాస్త్రి పొత్సహంతో ఇంకా తెలవారలేదు, మార్పు, వెలగని దీపం వెలిగింది, గెజిటెడ్ ఆఫీసర్ పద్మశ్రీ, భయం, ఎండ లాంటి కథలెన్నో రాశారు. కాల గమనంలో సుమారు ఓ వంద కథలు రాశారు. అందులో ఓ ఏడెనిమిది కథలు ఇతర భాషల్లోకి అనువదమయ్యాయి. ఓ వర్షం రాత్రి, పద్మశ్రీ అనే రెండు కథా సంకలనాలు వెలువరించాయి. రావిశాస్త్రి స్కూల్ ఆఫ్ రైటింగ్‌లో రాసే కథకుల్లో కాశీవిశ్వనాథ్‌కి ఓ ప్రముఖస్థానం ఉంటుందని పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఓ వర్షం రాత్రి కథా సంకలనం ముందుమాటలో రాశారు. కన్నీటికి నీరొచ్చింది, నలిగిపోయిన డైరీలో చినిగిపోయిన పేజీ, పూజకు పనికిరాని పువ్వు...లాంటి ఎన్నో నవలలు, మీరైతే ఏం చేస్తారు?, గరీబీహఠావో లాంటి నాటికలు బాగా ప్రాచుర్యంలో వచ్చాయి. కాశీవిశ్వనాథ్ రాసిన కథాసాగర్ సంపుటి గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్‌లో చేర్చడం విశేషం. ఎల్లప్పుడూ నవ్వుతూ జీవించడం..సీరియస్‌గా ఆలోచించడం, చిత్తశుద్ధితో కృషి చేయడమే ఆయన లక్ష్యంగా ఎదిగారు. కలిసొచ్చిన అదృష్టం : ఒక దీపం వెలిగింది నాటికకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డును అందుకున్న కాశీ విశ్వనాథ్‌కు వేదిక దిగుతుండగానే సినిమా రచన చేసే అవకాశాలొచ్చాయి. మరో ఇద్దరు నిర్మాతలతో కలసి వేదిక వద్దకు వచ్చిన ప్రఖ్యాత నిర్మాత డాక్టర్ చటర్జీ సినిమా రచన చేయాల్సిందిగా కోరారు. అలా ‘రామాయణంలో పిడకల వేట’సినిమాకు రాసిన కాశీవిశ్వనాథ్‌ను ఒకేసారి ఐదు సినిమా అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి. ఆ దశలో రావు గోపాలరావు, రాజుబాబు, నూతనప్రసాద్ అండగా నిలిచి ప్రోత్సహించారు. 1980 నుంచి ఇప్పటి వరకు 131 సినిమాలకు కథలు, మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చిన కాశీ విశ్వనాథ్ 52 చిత్రాల్లో నటించారు. ఆయన రచనలు సమాజంలోని సమస్యలను బలంగా ఆవిష్కరింప చేశాయి. సమస్యలకు పరిష్కారాలను కూడా సమగ్రంగా ప్రతిఫలించాయి. సందేశాలిచ్చిన ఆయన నాటకాలు వినోదానికి కూడా అగ్రాసనం వేశాయి. జీవనచిత్రం జన్మదినం : 05.07.1946 జన్మస్థలం : వన్‌టౌన్, విశాఖపట్నం తల్లిదండ్రులు: బుచ్చమ్మ, అప్పలస్వామి భార్య : మహాలక్ష్మి(అమ్మాజీ) కుమార్తె : పుష్పలత కుమారులు : కళ్యాణ చక్రవర్తి, ఇంజినీర్, శ్రీధర్, పోర్టు ఉద్యోగి విద్యార్హత : బి.ఏ అవార్డులు : 1980లో ఒక దీపం వెలిగింది నాటికకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డ్ 2005, 2006 సంవత్సరంలో మానవత్వానికి మరో కోణం నాటిక, ట్రెండ్ మారిన నాటకం, సినిమా రచన కొన్ని మౌలికాంశాలు పుస్తకాలకు వరసగా 3 నంది అవార్డులు 2007లో ఉత్తమ నాటక రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం. 2010లో రంగస్థల నటుడిగా ఎన్టీఆర్ స్మారక అవార్డు కథాసంకలనాలు : ఓ వర్షం రాత్రి, పద్మశ్రీ పుస్తకాలు : నాటక నవరత్నాలు, సినిమా రచన-కొన్ని మౌలిక అంశాలు మంచి హాస్య రచయిత కాశీ విశ్వనాథ్ చాలా మంచి హాస్య రచయిత. నేను ఆయన సినిమాల్లో కలిసి నటించాం. నాకు బావమర్దిగా నటించారు. నా కోసం చాలా సినిమాలు రాశారు. చాలా మంచి మిత్రుడు. ఆయన నాటకాలకు నేను మంచి ఉపోద్ఘాతాలు రాశాను. ఈ మధ్యనే ఆయన మనవడు పుట్టిన రోజు వేడుకలకు వెళ్లాను అదే చివరి చూపు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో నాకోసం ప్రత్యేకమైన పాత్రలకు సంభాషణలు రాశారు. సహచర నటుడిని కోల్పోయానన్న బాధ చాలా ఉంది. సినీ పరిశ్రమ మంచి హాస్య రచయితను కోల్పోయింది. ముఖ్యంగా ఆయన లేని లోటు సినీ పరిశ్రమకే కాకుండా విశాఖ కళా, సాహితీ రంగాలకు తీరని లోటు. ఈ లోటును పూడ్చడం కష్టం. -గొల్లపూడి మారుతీరావు, సినీ రచయిత, నటుడు విశాఖ సాహితికి స్ఫూర్తిదాయక సేవలు విశాఖ సాహితి సంస్థ కు కాశీ విశ్వనాథ్ అందించిన సేవలు స్ఫూర్తిదాయకం. ఆయన అప్పట్లో రాసిన వెలగని దీపం వెలిగింది అనే కథకు కథల పోటీలలో బహుమతి లభించింది. కథా రచయితగా వారి ప్రస్థానం విశాఖ సాహితి ద్వారానే జరిగిం ది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నాను. - ఆచార్య మలయవాసిని, అధ్యక్షురాలు, విశాఖ సాహితి ఆయన కామెడీ అమోఘం కామెడీ స్కిట్స్ రచన, నటనలకు మార్గదర్శకుడు కాశీవిశ్వనాథ్. కామెడీ క్లబ్లో భాగస్వామిగా ఉంటూ సభ్యులు నటించలేని కష్టమైన పాత్రలను ఆయన చేసేవారు. కామెడీ స్కిట్స్ ఎలా ఏ రూపంలో ఉంటే ప్రేక్షకులు నవ్వుతారో ఆయన వద్దనే నేర్చుకున్నాం. తాము ప్రదర్శించడానికి వేదికలు లభించని తరుణంలో కాశీవిశ్వనాథ్‌గారు మా క్లబ్లో ప్రదర్శించడం ప్రారంభించిన తర్వాత నగరంలో వేదికలు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయి. వుడా నిర్వహణలో ఉన్న గురజాడ కళాక్షేత్రం తమ క్లబ్‌కు ఆయన దయతోనే ఉచితంగా చాలా రోజులు ఇచ్చారు. ఆయన స్కిట్ రచిస్తే నవ్వులే పువ్వులు. -మస్తాన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రియేటివ్ కామెడీ క్లబ్ ఆయన ప్రసంగంలో అన్నీ నవ్వులే..! ఆయన నవ్వుల రసజ్ఞతను పంచే మహా హాస్యరచయిత. ఎక్కడ ప్రసంగిస్తే అక్కడే నవ్వులు జల్లుమంటాయి. అంగర సూర్యారావుగారు రచించిన తండ్రీకొడుకులు నాటకంలో కాశీవిశ్వనాథ్ గురువు, నేను బాల నటుడుగా నటించాను. ఆయన రచించిన అడ్రస్ లేని మనుష్యులు, ఓటున్న ప్రజలకు కోటి దండాలు, మనస్సున్న మనిషి, పూజకు పనికిరాని పువ్వు వంటి అద్భుతమైన నాటికలకు దర్శకత్వం వహించే భాగ్యం దక్కింది. కామెడీ నాటకాలు రాయడంలో చాలా దిట్ట. వాటిలో ఆయనకు ఓ ప్రత్యేకమైన స్టయిల్. మగమహారాజు చిత్రానికి కథ రచయితగా కీర్తిప్రతిష్టలు పొందారు. కాశీ విశ్వనాథ్‌లాంటి స్నేహశీలిని కోల్పోవడం ఇటు సాహిత్యానికి, నాటక, కథ రచయితలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు. కాశీవిశ్వనాథ్ గారు మోస్ట్ సక్సెస్ఫుల్ రైటర్. -ఎల్.సత్యానంద్, స్టార్ మేకర్ -
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది...
పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాలో నూతన్‌ప్రసాద్ చీటికీ మాటికీ ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’ అని చెబుతూంటే ఫక్కున నవ్వని తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆ డైలాగ్ సృష్టికర్త కాశీవిశ్వనాథ్. ఇలాంటి ఫన్టాస్టిక్ డైలాగ్స్‌ని ఆయన కోకొల్లలు సృష్టించారు. 1968 నుంచి ఆయన పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు, కథలు, నాటికలు, రేడియో నాటకాలు రాసి బాగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన నిర్మాత ఛటర్జీ ‘రామాయణంలో పిడకల వేట’ చిత్రానికి డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చారు. తొలి సినిమా తీసుకొచ్చిన ఖ్యాతితో ఆయన సినీ రచయితగా స్థిరపడిపోయారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగమహారాజు’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ ’ ‘ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం’, ‘దొంగ కోళు’్ల, ‘ఖైదీ నం 786’ తదితర చిత్రాలతో రచయితగా తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. 124 చిత్రాలకు కథ, మాటలు అందించిన కాశీవిశ్వనాథ్లో మంచి నటుడు కూడా ఉన్నాడు. ‘ఎదురింటి మొగుడు- పక్కింటి పెళ్లాం’, ‘శ్రీవారి చిందులు’ , ‘420’, ‘నాన్నగారు’... ఇలా మొత్తం 37 చిత్రాల్లో నటించారు. కాశీవిశ్వనాథ్లో చాలా మందికి తెలియని కోణం ఏమిటంటే- ఆయన మంచి వెయిట్ లిఫ్టర్. కోచ్‌గా అనేక మందికి వెయిట్ లిఫ్టింగ్ నేర్పించారు. సుమారు 50 ఏళ్ల నిర్విరామ సాిహ తీ ప్రయాణంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారాయన. ఎప్పుడూ హుషారుగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే కాశీ విశ్వనాథ్ మరణం-కళారంగానికి తీరని లోటు.