
Pc: IPl.com
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్! గాయంతో బాధపడుతున్న యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతడు తిరిగి జట్టులోకి చేరాడు. తొలుత గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు రుత్‌రాజ్ గైక్వాడ్ దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో రుతురాజ్ గైక్వాడ్ ఉత్తీర్ణత సాధించనట్లు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.
దీంతో అతడు డెవాన్ కాన్వేతో ఓపెనింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. "రుతురాజ్ పూర్తిగా గాయం నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతడు జట్టులతో చేరి తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. అదే విధంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు" అని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు.
మరో వైపు ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ వీసా సమస్య కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మార్చి 26నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: ICC Women’s World Cup 2022: పాకిస్తాన్ సంచలన విజయం.. పదమూడేళ్ల తర్వాత తొలిసారి!