ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన ఫైవ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పాకిస్తాన్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు (అక్టోబర్ 20) ముందు ఓ బిగ్ న్యూస్ తెలిసింది. వరల్డ్‌కప్‌కు ముందు సౌతాఫ్రికా టూర్ సందర్భంగా గాయపడ్డ (ఎడమ చేతి ఫ్రాక్చర్) స్టార్ ఆల్‌రౌండర్ ట్రవిస్ హెడ్ పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడని తెలుస్తుంది.
ఈ గురువారం హెడ్ భారత్‌కు పయనమవుతాడని సమాచారం. హెడ్.. అక్టోబర్ 25న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్ నుంచి జట్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా, వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో హెడ్‌కు చోటు లభించిన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకుంటే హెడ్ సేవలను ఏ సమయంలోనైనా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అతనికి రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని ఎంపిక చేయలేదు. సీఏ ఆశించిన విధంగానే హెడ్ ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను ఆదుకునేందుకు భారత్‌కు బయల్దేరనున్నాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆసీస్.. భారత్, సౌతాఫ్రికా చేతుల్లో ఓటమిపాలైంది. భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైన ఆసీస్.. సౌతాఫ్రికా చేతుల్లో 134 పరుగుల భారీ తేడాతో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment