చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (అక్టోబర్ 8) హైఓల్టేజీ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి లోనయ్యారు. వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ జరగదేమోనని దిగులుపెట్టున్నారు.
అయితే ఇవాళ ఉదయం చెపాక్ పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితి చూస్తే వర్షం వల్ల మ్యాచ్‌కు ఎలాంటి ఢోకా ఉండదేమోనని అనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ ఎండ విపరీతంగా కాస్తుంది. వర్షం పడే ఛాయలు అస్సలు కనిపించడం లేదు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అగ్రశ్రేణి జట్ల మధ్య పూర్తి మ్యాచ్ చూసే అవకాశం ఉంటుందని సంబరపడిపోతున్నారు.
కాగా, చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఇవాళ చెపాక్ మైదాన పరిసర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా.. రాత్రి ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సీయస్‌గా ఉండనుంది. చీకటి పడ్డాక మైదాన ప్రాంతంలో జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా వాష్ అవుట్ అయ్యే ప్రమాదం మాత్రం లేదని వాతావరణ శాఖ హెచ్చరించింది .
ఇదిలా ఉంటే, ఇవాల్టి మ్యాచ్‌కు భారత స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా దూరం కానున్నారని తెలుస్తుంది. డెంగ్యూ కారణంగా గిల్, చేతి గాయం కారణంగా హార్దిక్ ఆసీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండరని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయావకాశలపై భారీ ప్రభావం పడటం ఖాయం.
మరోవైపు గాయాల బెడద ఆసీస్‌ను కూడా వేధిస్తుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ గాయం కారణంగా భారత్‌తో మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరో ఆటగాడు ఆడమ్ జంపా నిన్న స్విమ్మింగ్ పూల్‌లో గాయపడ్డాడని తెలుస్తుంది. అయితే జంపా గాయాలు తీవ్రమైనవి కాకపోవడంతో అతను భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. భారత్-ఆసీస్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది.
తుది జట్లు (అంచనా)..
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్/హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్
Comments
Please login to add a commentAdd a comment