
డేవిడ్ వార్నర్(PC: IPL/BCCI)
ఐపీఎల్-2022 భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ కేవలం 54 బంతుల్లో 92 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. వార్నర్ తన అద్భుత ఇన్నింగ్‌తో సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చకున్నాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా గతేడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్‌కు జట్టుతో విభేదాలు ఏర్పాడ్డాయి. దీంతో టోర్నీ మధ్యలోనే కెప్టెన్సీ పదవి నుంచి తొలిగించారు.
అంతేకాకుండా జట్టులో పూర్తిగా చోటు కూడా కోల్పోయాడు. ఇక ఐపీఎల్-2022 వేలంలోకి వచ్చిన డేవిడ్ వార్నర్‌ను రూ. 6 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ తరపున వార్నర్ అదరగొడుతున్నాడు. కాగా ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్‌తో వార్నర్‌కు విభేదాలు ఉన్నప్పటికీ.. జట్టు ఆటగాళ్లతో మాత్రం అతడు స్నేహపూర్వకంగా ఉన్నాడు. మ్యాచ్‌కు ముందు వార్నర్.. ఎపస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇద్దరూ ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. అంతేకాకుండా మ్యాచ్ అనంతరం విలియమ్సన్‌తో వార్నర్ సెల్ఫీ కూడా దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: David Warner: సెంచరీ చేయకపోయినా పంతం నెగ్గించుకున్న వార్నర్!
Comments
Please login to add a commentAdd a comment