టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బ్రిస్బేన్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 4 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. లంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా 66 పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఆఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మన్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
ఆఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్(28), ఘనీ(22), ఇబ్రహీం జద్రాన్(22) పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక బౌలర్లలో హాసరంగా మూడు వికెట్ల పడగొట్టగా.. కుమారా రెండు, రజితా, డి సిల్వా తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చదవండి: T20 WC 2022: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ దూరం
Comments
Please login to add a commentAdd a comment