MS Dhoni- 2011 ODI World Cup- Rohit Sharma: ‘‘ఆరోజు వరల్డ్‌కప్ జట్టును ఎంపిక చేసేందుకు మేమంతా కూర్చుని చర్చలు సాగిస్తున్నాం. మొత్తం 15 మందికి చోటివ్వాలి. 1-14 వరకు అంతా సజావుగా సాగిపోయింది. పదిహేనో ఆటగాడిగా మేము రోహిత్ శర్మ పేరు సూచించాం.
గ్యారీ కిర్‌స్టన్ కూడా ఇది సరైన ఎంపిక అని మాకు మద్దతుగా నిలిచారు. కానీ కెప్టెన్ మాత్రం మాతో అంగీకరించలేదు. రోహిత్ శర్మకు బదులు పీయూశ్ చావ్లా కావాలని పట్టుబట్టాడు. అంతే.. గ్యారీ కిర్‌స్టన్ కూడా వెంటనే మాట మార్చేశాడు.
వెంటనే మాట మార్చాడు
‘‘అవును అదే బెటర్ చాయిస్’’ అన్నాడు. అలా రోహిత్ శర్మ వరల్డ్‌కప్ జట్టు నుంచి అవుట్ అయ్యాడు’’ అని బీసీసీఐ మాజీ సెలక్టర్ రాజా వెంకట్ అన్నాడు. మహేంద్ర సింగ్ ధోని ఆలోచనలకు అనుగుణంగానే 2011 వరల్డ్‌కప్ నాటి జట్టు ఎంపికలో స్వల్ప మార్పులు జరిగాయని గుర్తు చేసుకున్నాడు.
రోహిత్ శర్మ సేనపై భారీ అంచనాలు
పుష్కరకాలం తర్వాత భారత్ మరోసారి వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. 2011లో ధోని సేన ట్రోఫీని గెలిచిన నేపథ్యంలో.. ఈసారి రోహిత్ శర్మ బృందంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సొంతగడ్డపై టీమిండియా తప్పక టైటిల్ గెలుస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలో ఆసియా కప్-2023కి సోమవారం ప్రకటించిన జట్టు నుంచే ప్రపంచకప్ టీమ్‌ను ఎంపిక చేస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్న రోహిత్ శర్మకు 2011 నాటి జట్టులో చోటే దక్కలేదు.
వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దన్నాడు.. అతడి కోసం
ఈ విషయం గురించి రాజా వెంకట్ రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ధోని నిర్ణయం వల్లే నాడు రోహిత్ మెగా ఈవెంట్‌కు సెలక్ట్ కాలేదని చెప్పుకొచ్చాడు. నాడు రోహిత్ కంటే.. లెగ్ స్పిన్నర్ పీయూశ్ చావ్లావైపే మిస్టర్ కూల్ మొగ్గు చూపాడని చెప్పుకొచ్చాడు.
ఈ విషయంలో రోహిత్ తీవ్ర నిరాశకు గురైన మాట వాస్తవమేనని.. అతడి సెలక్ట్ చేయనందుకు తాము కూడా బాధ పడ్డట్లు తెలిపాడు. కెప్టెన్, కోచ్ ఒక మాట మీద ఉన్న తర్వాత.. 14 మందిని ఎంపిక చేసిన తాము నో అని చెప్పలేకపోయామని వాపోయాడు.
రోహిత్ బాధ పడ్డాడు.. మేమేం చేయలేకపోయాం
కాగా ఆరోజు జట్టులో స్థానం దక్కని కారణంగా తను ఎంతో వేదనకు గురయ్యానని రోహిత్ శర్మ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. నాడు వరల్డ్‌కప్‌లో పీయూశ్ ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆరంభంలో లోయర్ ఆర్డర్‌లో ఆడిన రోహిత్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసిన ఘనత మాత్రం ధోనిదేనని ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు.
ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 న భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో పోరుతో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.
చదవండి: అయ్యో రింకూ.. ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్! బుమ్రా మంచి మనసు
అందుకే తిలక్‌ను సెలక్ట్ చేశాం.. వరల్డ్ కప్ టీమ్‌లో: బీసీసీఐ చీఫ్ సెలక్టర్
Comments
Please login to add a commentAdd a comment