వరల్డ్‌కప్‌కు ముందు మరో వన్డే సిరీస్‌ను టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్(105), శ్రేయస్ అయ్యర్(104) సెంచరీలతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్( 72 నాటౌట్), కేఎల్ రాహుల్(52) ఆఖరిలో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరగులకు ఆలౌటైంది. భారత భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ప్రసిద్ద్ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ సిరీస్ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. వరల్డ్‌కప్‌కు ముందు ఇటువంటి అద్భుత విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని రాహుల్ తెలిపాడు.
అస్సలు ఊహించలేదు: రాహుల్
"నేను ఉదయం ఇండోర్ పిచ్‌ను పరిశీలించినప్పుడు ఇంత స్పిన్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఆసీస్ ముందు 400 పరుగుల లక్ష్యాన్ని పెట్టడం మా అత్మవిశ్వాసన్ని మరింత రెట్టింపు చేసింది. ఇక ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక అనేది మా చేతుల్లో లేనిది. జట్టులో మా పాత్రలపై మాకు ఒక సృష్టత ఉంది. ఎవరికి తుది జట్టులో చోటు దక్కినా 100 శాతం ఎఫక్ట్ పెట్టాలి.
ప్రతీ ఒక్కరూ బాధ్యతతో ఆడాలి. ఎప్పటికప్పుడూ ఆటను మెరుగుపరుచుకుంటూనే అవకాశాల కోసం ఎదురు చూడాలి. ఇక ఈ మ్యాచ్‌లో మేము కొన్ని క్యాచ్‌లను జారవిడిచాం. ఫ్లడ్ లైట్‌ల వెలుతురులో ఫీల్డింగ్ చేయడం అంత సులభం కాదు. అది ఎప్పుడూ ఆటగాళ్లకు ఒక సవాలుగా ఉంటుంది. మమ్మల్ని ఫిట్‌గా ఉంచేందుకు కోచ్‌లు తమ వంతు కృషి చేస్తున్నారు.
అయినప్పటికీ కొన్నిసార్లు ఇటువంటి తప్పిదాలు జరుగుతుంటాయి. కానీ మా కామిట్‌మెంట్ మాత్రం ఎప్పుడూ ఒక విధంగా ఉంటుంది. మా తదుపరి మ్యాచ్‌లో ఇటువంటి తప్పిదాలు జరగకుండా ప్రయత్నిస్తాం. ప్రపంచ కప్‌కు కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్నందున.. ఆఖరి మ్యాచ్‌కు సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి రానున్నారు. ఫైనల్ మ్యాచ్ జట్టు ఎంపిక గురించి ఇంకా చర్చించలేదు" అని రాహుల్ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు
Comments
Please login to add a commentAdd a comment