
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా మృతిపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మారడోనా వ్యక్తిగత వైద్యుడు, న్యూరాలజిస్ట్ లియోపోల్డో లుక్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. ఆయనకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు రావడంతో అర్జెంటీనా పోలీసులు ఆయన వ్యక్తిగత వైద్యుడైన లియోపోల్డోను విచారిస్తున్నారు. పోలీసులతో పాటు కోర్టు నియమించిన ప్రత్యేక అధికారులు మారడోనా సంబంధీకుల నుంచి డిక్లరేషన్ సేకరిస్తున్నారు. మారడోనా వైద్య రికార్డులను భద్రపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 60 ఏళ్ల మారడోనా గుండెపోటు కారణంగా గత బుధవారం కన్నుమూశారు. మెదడులో రక్త ప్రసరణలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనకు నవంబర్ 3న శస్త్రచికిత్స జరిగింది. ఈ చికిత్స నుంచి కోలుకుంటూనే అనూహ్యంగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment