Digo Maradona
-
ఫైనల్లో అర్జెంటీనా.. జనసంద్రంతో నిండిన వీధులు (ఫొటోలు)
-
FIFA WC: రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో
FIFA World Cup 2022- Argentina Vs Croatia- Lionel Messi: ప్రపంచకప్ గెలవాలన్న చిరకాల కల నెరవేర్చుకునే దిశగా దూసుకెళ్తున్నాడు మేటి ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ. కెరీర్లో ఇంతవరకు అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక్క అడుగుదూరంలో నిలిచాడు. ఫిఫా ప్రపంచకప్-2022లో భాగంగా ఖతర్ వేదికగా క్రొయేషియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో మెస్సీ బృందం ఘన విజయం సాధించింది. ఫైనల్ చేరాలన్న క్రొయేషియా ఆశలపై నీళ్లు చల్లుతూ 3-0తో చిత్తు చేసింది. తద్వారా 2014 తర్వాత తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ మ్యాచ్‌లో అద్భుతమైన గోల్‌తో మెరిశాడు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ. క్రొయేషియాతో మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీ కిక్కు గోల్‌గా మలిచిన ఈ స్టార్ ఫుట్‌బాలర్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రపంచకప్ టోర్నీలో అతడికి ఇది ఐదో గోల్. మొత్తంగా ఈ మెగా ఈవెంట్లో 11వది. తద్వారా అర్జెంటీనా తరఫున ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దిగ్గజ ఫుట్‌బాలర్ డిగో మారడోనా సహా గాబ్రియెల్ బటిస్టుటా, గిల్మెరో స్టబిలేను దాటుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్లు లియోనల్ మెస్సీ- 11(25 మ్యాచ్‌లు) గాబ్రియెల్ బటిస్టుటా- 10(12 మ్యాచ్‌లు) గిల్మెరో స్టబిలే- 8 (4 మ్యాచ్‌లు) డిగో మారడోనా- 8 (21 మ్యాచ్‌లు) మారియో కెంప్స్- 6 (18 మ్యాచ్‌లు) తనే మొదటివాడు ఇక ఈ రికార్డుతో మరో ఫీట్‌ను కూడా నమోదు చేశాడు మెస్సీ. ఒక వరల్డ్‌కప్ టోర్నీలో 5 గోల్స్ సాధించిన అత్యధిక వయస్కుడిగా నిలిచాడు 35 ఏళ్ల మెస్సీ. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! -
మారడోనా మృతిపై దర్యాప్తు...
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా మృతిపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మారడోనా వ్యక్తిగత వైద్యుడు, న్యూరాలజిస్ట్ లియోపోల్డో లుక్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. ఆయనకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు రావడంతో అర్జెంటీనా పోలీసులు ఆయన వ్యక్తిగత వైద్యుడైన లియోపోల్డోను విచారిస్తున్నారు. పోలీసులతో పాటు కోర్టు నియమించిన ప్రత్యేక అధికారులు మారడోనా సంబంధీకుల నుంచి డిక్లరేషన్ సేకరిస్తున్నారు. మారడోనా వైద్య రికార్డులను భద్రపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 60 ఏళ్ల మారడోనా గుండెపోటు కారణంగా గత బుధవారం కన్నుమూశారు. మెదడులో రక్త ప్రసరణలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనకు నవంబర్ 3న శస్త్రచికిత్స జరిగింది. ఈ చికిత్స నుంచి కోలుకుంటూనే అనూహ్యంగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. -
సెప్టెంబర్‌లో భారత్‌కు డీగో మారడోనా
కోల్‌కతా: అర్జెంటీనా సాకర్ దిగ్గజం డీగో మారడోనా రెండోసారి భారత పర్యటనకు రానున్నారు. వచ్చే సెప్టెంబర్ 18, 19 తేదీల్లో ఆయన కోల్‌కతాలో సందడి చేయనున్నారు. ఫుట్‌బాల్ కార్నివాల్ ప్రారంభోత్సవం కోసం భారత్‌కు రానున్న ఆయన... ఇక్కడున్న రెండు రోజుల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో కలిసి మారడోనా ఓ చారిటీ మ్యాచ్‌లో తలపడతారు. వీటితో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయనను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించనుంది. దాదాపు పదేళ్ల తర్వాత కోల్‌కతాకు రానుండటం తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని 56 ఏళ్ల మారడోనా అన్నారు. ‘కోల్‌కతాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. గత పర్యటనలో నాకు చాలా మధురానుభూతులు ఉన్నాయి. భారత్‌లో ఫుట్‌బాల్‌కు లభించే ఆదరణ అపూర్వం. పదేళ్ల తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లనుండటం నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది’ అని మారడోనా అన్నారు.