India vs England, 2nd Test At Vizag Day 2 Updates: వైజాగ్ టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. శనివారం నాటి ఆట ముగిసే సరికి 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి రోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ మెరవగా.. 336/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండు రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా 60 పరుగులు చేసింది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా ఆరు వికెట్లు తీయగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. వీరి దెబ్బకు ఇంగ్లండ్ 253 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా.. ఆట పూర్తయ్యేసరికి 28 పరుగులు చేసి.. 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 15, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
బుమ్రా మ్యాజిక్
వైజాగ్ టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఏకంగా ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఒలీ పోప్, రూట్, బెయిర్ స్టో, స్టోక్స్ రూపంలో బిగ్‌వికెట్లు ఖాతాలో వేసుకున్న బుమ్రా.. టెయిలెండర్లు టామ్ హార్లీ, జేమ్స్ ఆండర్సన్ వికెట్లు కూడా పడగొట్టాడు.
Memorable Performance ✅
— BCCI (@BCCI) February 3, 2024
Special Celebration 🙌
Well bowled, Jasprit Bumrah! 🔥 🔥
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/bRYTf68zMN
ఇతర బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. భారత బౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జాక్ క్రాలే 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా 396 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగించింది.
ఇంగ్లండ్ ఆలౌట్
55.5: బుమ్రా బౌలింగ్‌లో ఆండర్సన్(6) ఎల్బీడబ్ల్యూ. 253 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.
51.2: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
బుమ్రా ఖాతాలో మరో వికెట్ చేరింది. టామ్ హార్లీ రూపంలో ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోగా.. బుమ్రాకు ఈ మ్యాచ్‌లో ఇది ఐదో వికెట్. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు స్కోరు: 238/9 (51.3)
►బుమ్రా ఖాతాలో 150వ టెస్టు వికెట్‌గా స్టోక్స్
మరోసారి అద్భుతం చేసిన బుమ్రా.. స్టోక్స్ బౌల్డ్
49.2: బుమ్రా బౌలింగ్‌లో బెన్ స్టోక్స్(47) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అద్భుతమైన కట్టర్ సంధించి స్టోక్స్‌ను బోల్తా కొట్టించిన బుమ్రా మరో బిగ్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక స్టోక్స్ స్థానంలో జేమ్స్ ఆండర్సన్.. హార్లీకి జతగా క్రీజులో కి వచ్చాడు. స్కోరు: 230-8(50).
వేగం పెంచిన స్టోక్స్
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వీలు చిక్కినప్పుడల్లా షాట్లు బాదుతూ స్కోరు బోర్డు మీద పరుగులు జమచేస్తూ ఉన్నాడు. 48వ ఓవర్ ముగిసే సరికి 52 బంతులు ఎదుర్కొన్న అతడు 47 పరుగులు చేసి.. హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.
46 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 205-7
45.2: రెండు వందల పరుగుల మార్కు అందుకున్న ఇంగ్లండ్
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
42.3: కుల్దీప్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రెహాన్ అహ్మద్(6). రెహాన్ రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్‌కోల్పోగా.. అతడి స్థానంలో టామ్ హార్లీ స్టోక్స్‌కు జతగా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 182/7 (42.5)
42 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 181/6
స్టోక్స్ 17, రెహాన్ అహ్మద్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆరో వికెట్ డౌన్
38.2: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బెన్ ఫోక్స్(6) బౌల్డ్. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. రెహాన్ అహ్మద్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 172/6 (38.2)
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
35.4: టీ విరామం తర్వాత ఆట మొదలైన కాసేపటికే ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి జానీ బెర్ స్టో 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. బెన్ ఫోక్స్ క్రీజులోకి వచ్చాడు. జట్టు స్కోరు: 159/5 (35.5)
టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 155/4 (33)
బెయిర్ స్టో 24, స్టోక్స్ 5 పరుగులతో ఆడుతున్నారు.
నాలుగో వికెట్ డౌన్
ఓలీ పోప్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఓలీ పోప్‌ను బుమ్రా అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. 31 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 143/4
ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్
జోరూట్ రూపంలో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన రూట్.. శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి బెయిర్ స్టోవచ్చాడు. 27 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 134/3
ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్..
జాక్ క్రాలీ రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన క్రాలీ.. అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి జో రూట్ వచ్చాడు. 23 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 118/2
18 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 91/1
18 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(60), ఓలీ పోప్(11) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బెన్ డకెట్ ఔట్
59 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన బెన్ డకెట్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు..
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 59 పరుగులు చేసింది. క్రీజులో క్రాలీ(38), బెన్ డకెట్(21) పరుగులతో ఉన్నారు.
లంచ్ విరామానికి ఇంగ్లండ్ స్కోర్: 32/0
మొదటి రోజు లంచ్ విరామానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(15), బెన్ డకెట్(17) పరుగులతో ఉన్నారు.
396 పరుగులకు టీమిండియా ఆలౌట్
వైజాగ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులకు ఆలౌటైంది. 336/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండు రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా 60 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో జైశ్వాల్ 209 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్, రెహాన్ ఆహ్మద్, బషీర్ తలా 3 వికెట్లు పడగొట్టారు.
తొమ్మిదో వికెట్ డౌన్..
395 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన జస్ప్రీత్ బుమ్రా.. రెహన్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఎనిమిదో వికెట్ డౌన్.. జైశ్వాల్ ఔట్
యశస్వీ జైశ్వాల్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 209 పరుగులు చేసిన జైశ్వాల్.. అండర్సన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. 107 ఓవర్లకు భారత్ స్కోర్: 383/8
యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీ
బాషిర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు జైశ్వాల్. ఇది జైశ్వాల్‌కు కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ. జైశ్వాల్ డబుల్ సెంచరీలో 18 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. 202 పరుగులతో జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
డబుల్ సెంచరీకి చేరువలో జైశ్వాల్..
96 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(181), అశ్విన్(11) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ప్రారంభమైన రెండో రోజు ఆట..
విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య సెకెండ్ టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్‌ను స్పిన్నర్ షోయబ్ బషీర్ ప్రారంభించాడు. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి.. 93 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(179), అశ్విన్(5) పరుగులతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment