
మాంచెస్టర్ వేదికగా జరగుతున్న యాషెస్ నాలుగు టెస్టులో ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్ ధీటుగా బదులు ఇస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 592 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 384/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లండ్.. అదనంగా మరో 208 పరుగులు సాధించి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల అధిక్యం లభిచింది.
ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(189), జానీ బెయిర్ స్టో(99 నాటౌట్), రూట్(84) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అదే విధంగా ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 5 వికెట్లతో చెలరేగగా.. స్టార్క్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
పాపం బెయిర్ స్టో..
ఇక ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 81 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బెయిర్‌స్టో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 99 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆఖరి వికెట్‌గా అండర్సన్ వెనుదిరిగడంతో బెయిర్ స్టో తృటిలో సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. సెంచరీతో చెలరేగిన కింగ్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment