
లీడ్స్: ‘యాషెస్’ సిరీస్ మూడో టెస్టు అనేక మలుపులతో ఆసక్తికరంగా మొదలైంది. మొదటి రోజే ఇంగ్లండ్, ఆ్రస్టేలియా హోరాహోరీగా పోటీ పడ్డాయి. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 60.4 ఓవర్లలో 263 పరుగులకే ఆలౌటైంది.
మార్క్ వుడ్ (5/34) ప్రత్యర్థిని పడగొట్టాడు. వార్నర్ (4), ఖ్వాజా (13), లబుషేన్ (21), స్మిత్ (22) విఫలం కావడంతో ఒకదశలో ఆసీస్ 85/4 వద్ద నిలిచింది. అయితే ఆరో స్థానంలో బరిలోకి దిగిన మిచెల్‌మార్ష్ (118 బంతుల్లో 118; 17 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కసారిగా పరిస్థితిని మార్చేశాడు. నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన అతను మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు.మార్ష్, హెడ్ (39) ఐదో వికెట్ కు 28 ఓవర్లలోనే 155 పరుగులు జోడించారు.
అయితే ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు మళ్లీ పైచేయి సాధించారు. ఫలితంగా 23 పరుగులకే ఆసీస్ చివరి 6 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటింగ్ కూడా తడబడింది. గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 68 పరు గులు చేసింది. ఇంగ్లండ్ మరో 195 పరుగులు వెనుకబడి ఉంది.