![England Announce Playing XI For 3rd Test Against Sri Lanka](/s3fs-public/styles/webp/public/filefield_paths/f_0.jpg.webp?itok=uxAGSSGJ)
సెప్టెంబర్ 6 నుంచి కెన్నింగ్‌స్టన్ ఓవల్ వేదికగా శ్రీలంకతో జరిగే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ ఓ మార్పు చేసింది. మాథ్యూ పాట్స్ స్థానంలో 20 ఏళ్ల యువ పేసర్ జోష్ హల్ తుది జట్టులోకి వచ్చాడు. హల్‌కు ఇది అరంగేట్రం మ్యాచ్.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. రెండు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టు ఘన విజయాలు సాధించింది. తొలి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో.. తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో 190 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు: డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, ఓలీ స్టోన్, జోష్ హల్, షోయబ్ బషీర్
Comments
Please login to add a commentAdd a comment