చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ జట్టు విధించిన 420 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేని భారత జట్టు 192 పరుగులకే ఆలౌటై తద్వారా 227 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది. కాగా ఏడాదిలో ఇంగ్లండ్ ఆరు సిరీస్‌లు ఆడి 11 మ్యాచ్‌లు గెలిచి.. నాలుగు ఓడి.. 3 డ్రా చేసుకుంది. మొత్తం 442 పాయింట్లతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు మరింత దగ్గరైంది.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ వాయిదా పడడంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికి టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు ఇంకా ఉన్నాయి. రానున్న మూడు టెస్టుల్లో కనీసం రెండు టెస్టులు గెలిచినా భారత్ టెస్టు చాంపియన్‌షిప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఇంగ్లండ్ మిగతా మూడు టెస్టుల్లో రెండు గెలిస్తే మాత్రం టీమిండియాకు అవకాశాలు ఉండవు. లార్డ్స్ వేదికగా జూన్‌లో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
చదవండి: తొలి టెస్టు: టీమిండియా ఘోర పరాజయం
నిరాశ పరిచిన రహానే.. మంజ్రేకర్ కామెంట్లు!
Comments
Please login to add a commentAdd a comment