IPL 2023, LSG Vs RCB: Fan Touches Virat Kohli's Feet In Heartwarming Gesture, Pic & Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్‌.. కింగ్‌ ఏం చేశాడంటే?

Published Tue, May 2 2023 9:01 AM | Last Updated on Tue, May 2 2023 9:45 AM

Fan touches Virat Kohlis feet in heartwarming gesture, picture goes viral - Sakshi

PC: Twitter

ఐపీఎల్‌-2023లో భాగంగా వాజ్‌పేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌- ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లక్నో ఇన్నింగ్స్‌ జరుగుతుండగా ఆర్సీబీ మాజీ సారధి విరాట్‌ కోహ్లి వీరాభిమాని అయిన ఒ‍క వ్యక్తి.. భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి పరుగులు తీశాడు. నేరుగా కోహ్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని.. విరాట్‌ కాళ్లకు దండం పెట్టాడు.

వెంటనే కోహ్లి అతడిని పైకి లేవదీసి హగ్‌ చేసుకుని బయటకు వెళ్లాలని సూచించాడు. ఇక కోహ్లిని కలిసిన అభిమాని ఆనందానికి అవధులు లేకుండా లేకుండా పోయాయి. ఇక సదరు అభిమాని పట్ల కోహ్లి ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నోపై 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.


చదవండి: #Kohli,Gambhir Fight: మళ్లీ డిష్యూం డిష్యూం.. కోహ్లి, గంభీర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement