నోరు మూసుకొని’ నిరసన (AP Photo)
FIFA World Cup 2022 Germany Vs Japan- దోహా: ‘వన్ లవ్’ ఆర్మ్‌బ్యాండ్‌పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) తీసుకున్న నిర్ణయానికి జర్మనీ ఆటగాళ్లు వినూత్న నిరసన తెలిపారు. ఆటగాళ్లెవరైనా ‘వన్ లవ్’ బ్యాండ్‌తో బరిలోకి దిగితే వేటు(ఎల్లో కార్డ్) తప్పదని ‘ఫిఫా’ జర్మనీ సహా ఏడు యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్యలను హెచ్చరించింది. దీనికి నిరసనగా జర్మనీ ఆటగాళ్లు కుడిచేతితో తమ ‘నోరు మూసుకొని’ నిరసన తెలిపారు.
‘ఫిఫా’ నిర్ణయంపై యూరోపియన్ దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఖతర్‌లో వివిధ వర్గాలపై కొనసాగుతున్న వివక్షను నిరసిస్తూ మ్యాచ్‌ల సందర్భంగా ‘వన్ లవ్’ ఆర్మ్‌బ్యాండ్ ధరించి సంఘీభావం తెలపాలని ఏడు యూరోపియన్ జట్లు నిర్ణయం తీసుకున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జపాన్ చేతిలో అనూహ్య రీతిలో జర్మనీ ఓటమి పాలైంది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో జపాన్... నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన జర్మనీని 2–1 స్కోరుతో ఓడించింది.
చదవండి: Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో!
Suryakumar Yadav: సూర్యను కొనగలిగే స్థోమత, డబ్బు మా దగ్గర లేదు.. ఆటగాళ్లందరిపై వేటు వేస్తేనే!
Comments
Please login to add a commentAdd a comment