మెరిసిన పంత్, వార్నర్, పృథ్వీ షా
చెన్నై జట్టుకు తొలి పరాజయం
సాక్షి, విశాఖపట్నం: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ 17వ సీజన్‌లో గెలుపు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆదివారం ఇక్కడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు చేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడిపోయింది.
ఓపెనర్ల దూకుడు...
ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు పృథ్వీ షా (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) శుభారంభం అందించారు. వీరిద్దరు చెన్నై బౌలర్ల భరతం పట్టి తొలి వికెట్‌కు 9.3 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. ముస్తఫిజుర్ బౌలింగ్‌లో వార్నర్ రివర్స్ స్కూప్ షాట్ ఆడగా... పతిరణ డైవింగ్ చేస్తూ ఒంటిచేత్తో కళ్లు చెదిరేలా క్యాచ్ అందుకోవడంతో వార్నర్ ఇన్నింగ్స్ ముగిసింది. పది పరుగుల తర్వాత పృథ్వీ షా కూడా నిష్క్రమించాడు.
ఈ దశలో మార్‡్ష (12 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కెపె్టన్ రిషభ్ పంత్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అయితే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో పతిరణ మూడు బంతుల వ్యవధిలో అద్భుత యార్కర్‌లతో మార్‡్ష, స్టబ్స్ (0)ను పెవిలియన్‌కు పంపించాడు. మరో ఎండ్‌లో పంత్ తన దూకుడు కొనసాగించి 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని చెన్నైకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకపాత్ర పోషించాడు.
దెబ్బ కొట్టిన ఖలీల్, ముకేశ్
క్లిష్టమైన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై జట్టును ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఖలీల్ అహ్మద్ దెబ్బ కొట్టాడు. ఓపెనర్లు రుతురాజ్, రచిన్‌లను ఖలీల్ వెంటవెంటనే అవుట్ చేశాడు. దాంతో చెన్నై 7 పరుగులకే ఓపెనర్లను చేజార్చుంది. ఈ దశలో రహానే (30 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ (26 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించి ఆదుకున్నారు.
అయితే అక్షర్ బౌలింగ్‌లో మిచెల్ వెనుదిరగడంతో చెన్నై మళ్లీ ఇబ్బందుల్లో పడింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ముకేశ్ రెండు వరుస బంతుల్లో రహానే, రిజ్వీ (0)లను... ఆ తర్వాత 17వ ఓవర్లో దూబే (17 బంతుల్లో 18; 1 ఫోర్)ను అవుట్ చేయడంతో చెన్నై విజయ సమీకరణం క్లిష్టంగా మారింది. చివర్లో జడేజా (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు), ధోని (16 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) ధోని (బి) జడేజా 43; వార్నర్ (సి) పతిరణ (బి) ముస్తఫిజుర్ 52; పంత్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 51; మిచెల్ మార్‡్ష (బి) పతిరణ 18; స్టబ్స్ (బి) పతిరణ 0; అక్షర్ పటేల్ (నాటౌట్) 7; అభిõÙక్ పోరెల్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–93, 2–103, 3–134, 4–134, 5–178. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–42–0, తుషార్ దేశ్‌పాండే 4–0–24–0, ముస్తఫిజుర్ 4–0–47–1, జడేజా 4–0–43–1,
పతిరణ 4–0–31–3.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) పంత్ (బి) ఖలీల్ 1; రచిన్ రవీంద్ర (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 2; రహానే (సి) వార్నర్ (బి) ముకేశ్ 45; మిచెల్ (సి అండ్ బి) అక్షర్ పటేల్ 34; దూబే (సి) స్టబ్స్ (బి) ముకేశ్ 18; సమీర్ రిజ్వీ (సి) ఖలీల్ (బి) ముకేశ్ 0; జడేజా (నాటౌట్) 21; ధోని (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1–3, 2–7, 3–75, 4–102, 5–102, 6–120. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–1–21–2, ఇషాంత్ 3–0–23–0, నోర్జే 4–0–43–0, అక్షర్ పటేల్ 3–0–20–1, రసిఖ్ సలామ్ 2–0–25–0, మార్‡్ష 1–0–14–0, ముకేశ్ 3–0–21–3.
Comments
Please login to add a commentAdd a comment