షార్జా: ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెత్త రికార్డు నమోదు చేసింది. ఇలా బ్యాటింగ్‌కు దిగిందో లేదో క్యూకట్టేసింది. ముంబై పేసర్లు బుమ్రా, బౌల్ట్‌ల దెబ్బకు పవర్ ప్లే ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (0), డుప్లెసిస్(1), అంబటి రాయుడు(2), జగదీశన్(0), ఎంఎస్ ధోని(16), జడేజా(7)లు ఘోరంగా విఫలమయ్యారు. గైక్వాడ్, డుప్లెసిస్‌లను బౌల్ట్ ఔట్ చేయగా, రాయుడు, జగదీశన్‌లను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత జడేజాను బౌల్ట్ ఔట్ చేయగా, రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ధోని నిష్ర్కమించాడు.
ఏడు ఓవర్లలోనే సీఎస్‌కే ఆరు వికెట్లు కోల్పోగా, పవర్ ప్లే ముగిసే సరికి ఐదు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా చెత్త రికార్డును సీఎస్‌కే మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే పవర్ ప్లేలో ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. దాంతో చెన్నై మరో అపప్రథను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడం కూడా ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్ల దెబ్బకు సీఎస్‌కే చెల్లాచెదురైంది. మూడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడు ఓవర్లలోపే నాలుగు వికెట్లను కోల్పోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment