న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం కొత్త జూనియర్ సెలక్షన్ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా తమిళనాడు రంజీ జట్టు మాజీ కెప్టెన్ శ్రీధరన్ శరత్‌ను నియమించింది. సౌత్ జోన్ నుంచి శ్రీధరన్ శరత్, వెస్ట్ జోన్ నుంచి పాథిక్ పటేల్, సెంట్రల్ జోన్ నుంచి హర్విందర్ సింగ్ సోధి, ఈస్ట్ జోన్ నుంచి బెంగాల్ మాజీ ఫాస్ట్ బౌలర్ రణదేబ్ బోస్ ప్రాతినిధ్యం వహిస్తారని బీసీసీఐ పేర్కొంది.
ఇదిలా ఉంటే, జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన శ్రీధరన్ శరత్.. తమిళనాడు తరఫున 139 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 27 సెంచరీలు, 42 అర్ధ సెంచరీల సాయంతో 8700 పరుగులు(51 సగటులో) చేశాడు. శ్రీధరన్ శరత్ తమిళనాడు తరపున 100 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. శ్రీధరన్ శరత్ నేతృత్వంలోని కొత్త సెలెక్షన్ కమిటీ త్వరలో అండర్-19 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. అండర్ -19 ప్రపంచకప్ వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరుగనుంది.
చదవండి: గంటల వ్యవధిలో పాక్ క్రికెట్‌కు మరో షాక్.. ?
Comments
Please login to add a commentAdd a comment