410 పరుగులు నాటౌట్‌.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో కొత్త చరిత్ర | Glamorgan Batter Script History 1st Batter Since Brian Lara To Score 400 | Sakshi
Sakshi News home page

Sam Northeast: 410 పరుగులు నాటౌట్‌.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో కొత్త చరిత్ర

Published Sat, Jul 23 2022 9:06 PM | Last Updated on Sat, Jul 23 2022 9:16 PM

Glamorgan Batter Script History 1st Batter Since Brian Lara To Score 400 - Sakshi

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కొత్త చరిత్ర నమోదైంది. గ్లోమోర్గాన్‌ బ్యాటర్‌ సామ్‌ నార్త్‌ఈస్ట్‌ 400 పరుగుల మార్క్‌ను సాధించాడు. లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో భాగంగా శనివారం సామ్‌ నార్త్‌ఈస్ట్‌ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా 450 బంతుల్లో 45 ఫోర్లు, 3 సిక్సర్లతో 410 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో గ్లోమోర్గాన్‌ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా సామ్‌ నార్త్‌ఈస్ట్‌ నిలిచాడు. తొలి స్థానంలో విండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా ఉన్నాడు.

1994లో  వార్విక్‌షైర్‌ తరపున లారా 501 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు లారా పేరిటే ఉంది. 2004లో ఇంగ్లండ్‌పై అంటింగ్వా వేదికగా లారా 400 పరుగులు నాటౌట్‌ చేశాడు. టెస్టుల్లో ఏకైక క్వాడ్రపుల్‌ సెంచరీ(400) లారా పేరు మీద ఉండడం విశేషం. సామ్‌ నార్త్‌ఈస్ట్‌కు జతగా జి.కూక్‌ 227 బంతుల్లో 191 నాటౌట్‌ రాణించడంతో గ్లోమోర్గాన్‌ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 795  పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

చదవండి: END Vs SA: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ అద్బుత విన్యాసం.. మార్క్రమ్‌ డైమండ్‌ డక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement