వన్డే ప్రపంచకప్-2023 సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో అనుహ్యంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సెలక్టర్లు చోటుకల్పించారు. ఈ సిరీస్‌కు అశ్విన్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు మాత్రం మరోసారి మొండి చేయి చూపించారు.
అశ్విన్‌తో పాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు కూడా ఈ జట్టులో చోటుదక్కింది. ఇక ఆసీస్ సిరీస్‌కు చాహల్‌ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. చాహల్ ఎవరితోనైనా గొడవపడి ఉండవచ్చు, అందుకే అతడిని ఎంపిక చేయడం లేదని భజ్జీ సంచలన వాఖ్యలు చేశాడు.
చాహల్ ఎవరితోనైనా గొడవపడ్డాడేమో..
"యుజ్వేంద్ర చాహల్ ఆసీస్ సిరీస్ జట్టులో ఉండాల్సింది. అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదో నాకు అర్ధం కావడం లేదు. అతడు ఎవరితోనైనా గొడవపడ్డాడా? లేదా ఎవరికైనా ఏమన్నా అన్నాడా? అనేది మాత్రం తెలియడం లేదు. కేవలం స్కిల్స్ పరంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తే చాహల్‌కు కూడా చోటు ఇవ్వాలి.
చాలా మంది భారత ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నందున చాహల్ పేరు జట్టులో ఉంటుందని భావించాను. జట్టు మేనెజ్‌మెంట్ హాఫ్ స్పిన్నర్ల కోసం వెతుకుతున్నట్లు నాకు అన్పిస్తోంది. అందుకే వరల్డ్‌కప్ ప్రణాళికలలో లేని అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌కు మళ్లీ పిలుపునిచ్చారని" భజ్జీ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
తొలి రెండు వన్డేల కోసం భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
మూడో వన్డే కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్
చదవండి: #Shaheen Afridi: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ ఆఫ్రిది.. హాజరైన బాబర్ ఆజం! ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment