వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ ప్రయాణం జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్స్‌లోనే ముగిసింది. వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్ చేతిలో ఓటమి పాలైన కరీబియన్ జట్టు వరల్డ్‌కప్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
ఒకప్పుడు క్రికెట్‍లో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన విండీస్.. ప్రస్తుతం పసికూనల చేతిలో కూడా ఓటమి పాలై ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంటుంది. అయితే వన్డే ప్రపంచకప్ రేసు నుంచి నిష్క్రమించిన విండీస్‌కు.. కొన్ని అద్భుతాలు జరిగితే మాత్రం భారత గడ్డపై అడుగుపెట్టే అవకాశం ఉంది.
అది ఎలా అంటే?
వెస్టిండీస్ జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించాలంటే అది పాకిస్తాన్‌తోనే సాధ్యం. భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనేందుకు ఇంకా ఆ దేశ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఈ క్రమంలో ఏవైనా అద్భుతాలు జరిగి పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగితే.. అప్పుడు ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్‌లో మూడో స్ధానంలో నిలిచిన జట్టు ప్రధాన పోటీకి అర్హత సాధిస్తుంది.
టాప్ 3కి విండీస్ చేరుకోవాలంటే?
వెస్టిండీస్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉంది. పాయింట్ల పట్టికలో విండీస్ మూడో స్ధానానికి చేరుకోవాలంటే అంత సులభం కాదు. ప్రస్తుతం కరిబీయన్ జట్టు సూపర్ సిక్స్ దశలో ఒక మ్యాచ్ ఆడింది. వెస్టిండీస్ ఖాతాలో ప్రస్తుతం సున్నా పాయింట్లు ఉన్నాయి. విండీస్ ఇంకా సూపర్ సిక్స్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ శ్రీలంక, ఒమన్‌లతో తలపడనుంది.
ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ విండీస్ భారీ తేడాతో గెలవాలి. అప్పుడు విండీస్ ఖాతాలోకి 4 పాయింట్లు వస్తాయి. అదే విధంగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్ధానంలో ఉన్న స్కాట్లాండ్, నెదార్లాండ్స్ మిగిలిన మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాలి. ముఖ్యంగా స్కాట్లాండ్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో జింబాబ్వే, నెదర్లాండ్స్‌పై ఓటమి చెందాలి. ఎందుకంటే స్కాట్లాండ్ ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లు ఉన్నాయి.
ఒక స్కాట్లాండ్ తమ తదపరి మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించినా విండీస్ దారులు మూసుకుపోతాయి. అదే విధంగా నెదర్లాండ్స్ ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు ఉన్నాయి. ఈ క్రమంలో నెదర్లాండ్స్.. ఒకవేళ స్కాట్లాండ్‌పై విజయం సాధించినా, ఒమన్ చేతిలో ఓడిపోతే వెస్టిండీస్ అవకాశం ఉంటుంది. అప్పుడు స్కాట్లాండ్, వెస్టిండీస్, నెదర్లాండ్స్ నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ సమయంలో నెట్‌రన్‌రేట్ కీలకం కానుంది.
చదవండి: Team India Sponsership: 67 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి! బీసీసీఐతో బంధం.. గర్వంగా ఉంది: భావోద్వేగ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment