
న్యూఢిల్లీ: ఆసీస్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ డ్యాన్స్ వీడియోలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో వార్నర్ రెగ్యులర్‌గా తన డ్యాన్స్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసి అందర్నీ అలరించాడు. తన భార్యతో పిల్లలతో కలిసి వార్నర్ చేసిన వీడియోలు విపరీతంగా ఆకర్షించాయి. ఇప్పుడు ఐపీఎల్‌లో బిజీగా ఉన్న వార్నర్.. తాజాగా ఒక యూట్యూబ్ చానల్‌ను ఓపెన్ చేశాడు. దానికి అందరీ సహకారం కోరుతూ ట్వీటర్‌లో విజ్ఞప్తి చేశాడు. ‘ ప్రతీ ఒక్కరికీ తెలియజేస్తున్నా. నేను ఒక యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించాను. నా కొత్త యూట్యూబ్ చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మరిచిపోకండి. ప్రతీ వారం నన్ను ఫాలోకండి’ అని వార్నర్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.(నేను రన్స్ ఇవ్వడం కాదు.. వారు కొడుతున్నారు!)
దానికి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘ నీ డ్యాన్సింగ్ వీడియోలో యూట్యూబ్ చానల్‌లో ఉంటాయని ఆశిస్తున్నా’ అని యువీ తన రిప్లైలో పేర్కొన్నాడు. గురువారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 201 పరుగులు చేసింది. వార్నర్ 52 పరుగులు చేయగా, బెయిర్ స్టో 97 పరుగులతో మెరిశాడు.ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్ పంజాబ్ తడబడి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
I really hope your dancing videos are in there 🤪
— Yuvraj Singh (@YUVSTRONG12) October 9, 2020
Comments
Please login to add a commentAdd a comment