
Updates:
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా
30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్
మూడో వికెట్‌గా వెనుదిరిగిన విరాట్‌కోహ్లి(11)
ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేనాటికి భారత్ స్కోర్ 44-3
తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్(2) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మాట్ హెన్రీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 15/1.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, భారత్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది.
యువ పేసర్ హర్షిత్ రాణాకు మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు కివీస్ కూడా ఓ మార్పుతో ఆడుతోంది. డెవాన్ కాన్వే స్ధానంలో డార్లీ మిచెల్ జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి ఇది 300వ వన్డే కావడం విశేషం.
తుది జట్లు
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కే
చదవండి: 'ఐపీఎల్‌ను బాయ్‌కట్ చేయండి'.. భారత్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్
Comments
Please login to add a commentAdd a comment