ICC Mens T20 World Cup 2021 To Be Held In UAE: Check For More Details - Sakshi
Sakshi News home page

యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌

Published Mon, Jun 28 2021 3:54 PM | Last Updated on Mon, Jun 28 2021 7:31 PM

ICC Mens T20 World Cup 2021 To Be Held In UAE Says BCCI President Sourav Ganguly - Sakshi

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌రో మెగా టోర్నీ భారత్‌ నుంచి త‌ర‌లిపోయింది. ప్రస్తుత ప‌రిస్థితుల్లో టీ20 ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమిచ్చే అవకాశం లేకపోవడంతో యూఏఈ వేదికగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అధికారికంగా ప్రకటించారు. ఈ టోర్నీ అక్టోబర్‌ 17న మొదలై.. నవంబర్‌ 14న జరిగే టైటిల్‌ పోరుతో ముగుస్తుందని గంగూలీ వెల్లడించారు. 

టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి తుది నిర్ణ‌యం వెల్లడించేందుకు ఈ రోజే ఆఖరి రోజు కావడంతో సోమ‌వారం బీసీసీఐ ఆఫీస్ బేరర్లు సమావేశమై ఈ మేరకు నిర్ణయించారు. సరిగ్గా ఐపీఎల్‌ ఫైనల్‌ (అక్టోబర్‌ 15) ముగిసిన రెండో రోజే ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభవుతుంది. ఈ పోటీలకు సంబంధించిన క్వాలిఫ‌య‌ర్స్ పోటీలు ఒమ‌న్‌లో జ‌రుగనుండగా, టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు దుబాయ్‌, అబుదాబి, షార్జాలు వేదికలు కానున్నాయి. 
చదవండి: మాట మార్చిన ద్రవిడ్‌.. అప్పుడు అందరికీ అవకాశం అన్నాడు, ఇప్పుడేమో..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement