రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌.. కేప్‌టౌన్‌ పిచ్‌పై ఐసీసీ సీరియస్‌ | ICC rate Newlands pitch for 2nd Test between South Africa and India as unsatisfactory | Sakshi
Sakshi News home page

IND vs SA 2nd Test: రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌.. కేప్‌టౌన్‌ పిచ్‌పై ఐసీసీ సీరియస్‌

Published Tue, Jan 9 2024 4:29 PM | Last Updated on Tue, Jan 9 2024 5:06 PM

ICC rate Newlands pitch for 2nd Test between South Africa and India as unsatisfactory - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం కన్న ఈ మ్యాచ్‌కు ఉపయెగించిన పిచ్‌ ఎక్కువ వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్‌ కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ముగిసింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా కేప్‌టౌన్‌ టెస్టు రికార్డులకెక్కింది.

ఈ పిచ్‌పై పేసర్లు పండగ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌ తొలి రోజు ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌పై సర్వత్రా  విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పిచ్‌పై ఇరు జట్ల కెప్టెన్‌లు డీన్‌ ఎల్గర్‌, రోహిత్‌ శర్మ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశారు.

                         

ఐసీసీ సీరియస్‌.. 
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ పిచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో టెస్టుకు ఉపయోగించిన పిచ్‌ నాసిరకంగా ఉందని ఐసీసీ పేర్కొంది. నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా క్రికెట్‌ను మందలిస్తూ న్యూలాండ్స్‌ పిచ్‌కు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. ఈ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్‌ బ్రాడ్‌ నివేదిక ప్రకారం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 

"న్యూలాండ్స్‌లోని పిచ్‌లో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బంతి భయంకరంగా బౌన్స్‌ అయింది. షాట్లు ఆడేందుకు చాలా కష్టమైంది.  బౌన్స్ కారణంగానే వికెట్లు కూడా ఎక్కువగా నేలకూలాయి" అని బ్రాడ్‌ పేర్కొన్నారు.
చదవండి: ENG vs IND: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆటగాడు వచ్చేస్తున్నాడు!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement