ఆస్ట్రేలియా వేదికగా ఇటీవలే టి20 ప్రపంచకప్ 2022 ముగిసిన సంగతి తెలిసిందే. ఆరంభం నుంచి ఫేవరెట్‌గా కనిపించిన ఇంగ్లండ్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్‌ను మట్టికరిపించి రెండోసారి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక 2024లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే 2024లో జరగనున్న టి20 వరల్డ్ కప్ సరికొత్త ఫార్మాట్లో జరగనుందని ఐసీసీ మంగళవారం తెలిపింది.
రానున్న టి20 వరల్డ్ కప్‌లో 20 జట్లు పాల్గొంటాయని పేర్కొంది. కొత్త ఫార్మాట్ వివరాలను వెల్లడించిన ఐసీసీ..2024 టి20 ప్రపంచకప్‌లో సూపర్ 12 దశ ఉండదని.. దాని స్థానంలో సూపర్ 8 దశను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఇక సూపర్-8లో రెండు గ్రూపులు ఉంటాయని పేర్కొంది. ఇక గ్రూప్ దశలో 20 జట్లను 4 గ్రూపులుగా విడగొట్టి టోర్నీని నిర్వహించనుంది. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉండనున్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన రెండు జట్లు సూపర్-8కు చేరుకోనున్నాయి.
సూపర్ 8లోనూ గ్రూపులు..
సూపర్ 8 దశలో నాలుగేసి జట్లను రెండు గ్రూపులుగా విడిపోయి తలపడుతాయి. ఈ రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కు క్వాలిఫై అవుతాయి. సెమీస్లో గెలిచిన జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
12 జట్లు నేరుగా అర్హత..
2024 టి20 వరల్డ్ కప్ కోసం 12 జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. ఆతిథ్య దేశాలుగా వెస్టిండీస్, అమెరికా జట్లకు స్థానం దక్కింది. టి20 వరల్డ్‌కప్ 2022లో సూపర్-12 నుంచి టాప్ 8 జట్లు 2024 వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ నేరుగా ఆడనున్నాయి. వీటితో పాటు.. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లు అర్హత పొందాయి. మరో 8 స్థానాల కోసం క్వాలిఫికేషన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
చదవండి: టీమిండియా బౌలర్ల అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment