ICC Women ODI World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్- 2022 టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతోంది. మెగ్ లానింగ్ సారథ్యంలో ఆసీస్ వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. విండీస్‌ను చిత్తు చేసి మెగా ఈవెంట్‌లో వరుసగా నాలుగో విజయం సాధించింది.
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆదిలోనే విండీస్ జట్టుకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ డకౌట్ కాగా.. డియేండ్ర డాటిన్ 16 పరుగులకే పెవిలియన్ చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన నైట్ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది.
ఈ క్రమంలో 50 పరుగులు చేసిన స్టెఫానీ టేలర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. వికెట్ కీపర్ కాంప్‌బెల్ 20 పరుగులు చేయగా మిగతా వాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో 131 పరుగులకే విండీస్ ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లు పెర్రీ, గార్డెనర్ మూడేసి వికెట్లు కూల్చగా.. స్కాట్ ఒకటి, జొనాసెన్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆదిలోనే ఓపెనర్ అలీసా హేలీ వికెట్ కోల్పోయినప్పటికీ... మరో ఓపెనర్ రేచెల్ హేన్స్ 83 పరుగులతో చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుబాట పట్టించింది. రేచెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో 30.2 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో విజయం ఆసీస్ సొంతమైంది. ఇక ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పెర్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మహిళల ప్రపంచకప్- ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్
వెస్టిండీస్- 131 (45.5)
ఆస్ట్రేలియా- 132/3 (30.2)
చదవండి: Rohit Sharma: అతడి ఆట తీరు ఎలా ఉన్నా స్వీకరిస్తాం.. అయితే, అనవసర షాట్లు వద్దని చెప్పాం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment