మూడు ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో కార్తీక్ టీమిండియాకు బెస్ట్ ఫినిషర్‌గా మారాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా కార్తీక్ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను కార్తీక్‌కు టీమిండియా జట్టులో చోటు దక్కింది. అదే ఫామ్‌ను కార్తీక్ కొనసాగిస్తున్నాడు.
అయితే ఆస్ట్రేలియా వేదికగా జరగునున్న టీ20 ప్రపంచకప్‌కు కార్తీక్‌ను ఎంపిక చేయాలని మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కోవలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ కూడా చేరాడు. ప్రస్తుత ఫామ్‌ను బట్టి రిషబ్ పంత్ కంటే కార్తీక్‌కే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. టీ20 ప్రపంచకప్‌కు ఇద్దరు వికెట్ కీపర్‌లను మాత్రమే బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉంది. వీరిలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదే విధంగా జట్టులో బ్యాకప్ ఓపెనర్‌గా కిషన్ ఎంపిక కావచ్చు. ఇక ఫినిషర్ పాత్ర కోసం పంత్ లేదా కార్తీక్‌కు ఛాన్స్ దక్కనుంది. అయితే ప్రస్తుత సిరీస్‌లతో పంత్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. కాబట్టి కార్తీక్ నుంచి పంత్‌కు ముప్పు పొంచి ఉంది.
"ప్రస్తుత సిరీస్‌లో పంత్‌కు నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశాలు వచ్చాయి. అతడు అదే తప్పులు చేసి తన వికెట్‌ను కోల్పోతున్నాడు. అత్యుత్తమ ఆటగాళ్లు తమ తప్పులను చక్కదిద్దుకుంటారని నేను భావిస్తున్నాను. అయితే కార్తీక్ మాత్రం తనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. కార్తీక్ ఒక క్లాస్ ఆటగాడు. భారత్ ప్రపంచకప్ గెలవాలంటే అతడు ఖచ్చితంగా జట్టులో ఉండాలి. ఎందుకంటే కార్తీక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు" అని స్టెయిన్ పేర్కొన్నాడు.
చదవండి: Stuart MacGill: 'పాయింట్ బ్లాక్‌లో గన్.. నగ్నంగా నిలబెట్టి దారుణంగా కొట్టారు'
Comments
Please login to add a commentAdd a comment