అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖ్వాజా వికెట్ తీసిన బుమ్రా టెస్ట్‌ల్లో ఈ ఏడాది 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఈ ఏడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా తర్వాతి స్థానాల్లో అశ్విన్ (46), షోయబ్ బషీర్ (45), రవీంద్ర జడేజా (44), గస్ అట్కిన్సన్ (44) ఉన్నారు. ఈ రికార్డుతో పాటు బుమ్రా మరో రెండు రికార్డులు కూడా సాధించాడు. అవేంటంటే..
- పాట్ కమిన్స్ తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్‌లో (2019) 50 ప్లస్ వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
- కపిల్ దేవ్ (1979లో 74 వికెట్లు, 1983లో 75 వికెట్లు), జహీర్ ఖాన్ (2022లో 51 వికెట్లు) తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్‌లో 50 ప్లస్ వికెట్లు తీసిన మూడో భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఆసీస్‌తో రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ తొలి రోజు ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మిచెల్ స్టార్క్ (6/48) ధాటికి 180 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు.
భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఆసీస్.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 94 పరుగులు వెనుకపడి ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (13) ఔట్ కాగా.. మార్నస్ లబుషేన్ (20), నాథన్ మెక్‌స్వీని (38) క్రీజ్‌లో ఉన్నారు. ఉస్మాన్ ఖ్వాజా వికెట్ బుమ్రాకు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment