![IND vs AUS: Rohit Sharma smashes 9th ton on Test return - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/10/Rohit-Sharma.jpg.webp?itok=mIfOvjZV)
నాగ్‌పూర్ వేదికగా జరగుతోన్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 171 బంతుల్లో రోహిత్ శతకం నమోదు చేశాడు. దీంతో తన రెండేళ్ల టెస్టు సెంచరీ నిరీక్షణకు రోహిత్ తెరదించాడు. కాగా రోహిత్ కెరీర్‌లో ఇది 9వ టెస్టు సెంచరీ కావడం గమానార్హం. రోహిత్ చివరసారిగా 2021లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో సెంచరీ సాధించాడు.
ఇక రోహిత్ 104 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓ వైపు వరుస క్రమంలో వికెట్లు కోల్పోతున్నప్పటికీ రోహిత్ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 14 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.
69 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌తో పాటు జడేజా ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(20), విరాట్ కోహ్లి(12), పుజారా(7), అరంగేట్ర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(8) తీవ్రంగా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో యువ స్పిన్నర్ టాడ్ మార్ఫీ నాలుగు వికెట్లు, లియాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
చదవండి: IND vs AUS: ఆసీస్ స్పిన్నర్ దెబ్బకు సూర్యకు మైండ్ బ్లాంక్.. అయ్యో ఇలా జరిగిందే!!
Smiles, claps & appreciation all around! 😊 👏
— BCCI (@BCCI) February 10, 2023
This has been a fine knock! 👍 👍
Take a bow, captain @ImRo45 🙌🙌
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/gW0NfRQvLY
Comments
Please login to add a commentAdd a comment