Ind vs Aus: Virat Kohli hits the gym after joining India camp in Nagpur - Sakshi
Sakshi News home page

IND Vs AUS: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. జిమ్‌లో కోహ్లి కసరత్తులు! వీడియో వైరల్‌

Published Fri, Feb 3 2023 3:24 PM | Last Updated on Fri, Feb 3 2023 3:41 PM

IND Vs AUS: Virat Kohli hits the gym after joining India camp in Nagpur - Sakshi

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో అదరగొట్టేందుకు టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సిద్దమవుతున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కింగ్‌ కోహ్లి.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ కోసం జట్టుతో కలిసాడు. 

ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌ వేదికగా ఆసీస్‌-భారత్‌ మధ్య తొలి టెస్టు జరగనుంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్‌ క్యాంప్‌లో భారత జట్టు తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి కూడా  జిమ్ లో కసరత్తులు మొదలుపెట్టాడు. 

ఇందుకు సంబంధించిన వీడియోను విరాట్‌ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియోకు "మళ్లీ తిరిగివచ్చాను" అంటూ కోహ్లి క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా కూడా భారత్‌ గడ్డపై అడుగుపెట్టింది. ఆసీస్‌ ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని ఆలూర్ లో ప్రాక్టీస్ చేస్తోంది.

ఇక వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు భారత్‌ చేరాలంటే ఈ సిరీస్‌ చాలా కీలకం. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు భారత్‌ గెలుస్తే చాలు ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. డబ్ల్యూటీసీ  పాయింట్ల పట్టికలో 75.56 శాతంతో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పటికే తమ ఫైనల్‌ స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదే విధంగా డబ్ల్యూటీసీ  పాయింట్ల పట్టికలో 58.93 శాతంతో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: MS Dhoni Police Look: ‘హీరో’కు ఏమాత్రం తీసిపోడు! ఏం మాట్లాడుతున్నారు? నిజంగానే.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement