Ind Vs Ban 2nd Test: Netizen Brutally Troll R Ashwin, See His Reaction Tweet Viral - Sakshi
Sakshi News home page

Ind Vs Ban: ఆ క్యాచ్‌ పడితే నీ ఆట ముగిసేది.. భారత్‌ 89కే ఆలౌట్‌ అయ్యేది! దిమ్మతిరిగేలా అశ్విన్‌ కౌంటర్‌

Published Mon, Dec 26 2022 2:21 PM | Last Updated on Tue, Dec 27 2022 12:54 PM

Ind vs Ban: Attempt To Troll Ashwin Brutally Backfires He Dropped Dolly - Sakshi

Bangladesh vs India, 2nd Test- Ravichandran Ashwin: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌గా.. కీలకమై సమయంలో బ్యాటర్‌గానూ రాణిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో అశ్విన్‌ విలువైన ఇన్నింగ్స్‌ ఆడిన విషయం తెలిసిందే. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి.. అశూ 17.3 ఓవర్ల పాటు అసాధారణ పోరాటం చేశాడు. 

వికెట్లకు నేరుగా టర్న్‌ అవుతున్న బంతుల్ని చక్కగా కాచుకొని తెలివిగా బ్యాటింగ్‌ చేశాడు. మెహిదీ వేసిన 47వ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాది మ్యాచ్‌ను ముగించి భారత్‌కు విజయం అం‍దించాడు ఈ ఆల్‌రౌండర్‌. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సంతోషాన్ని పంచుకుంటూ ‘‘గొప్ప మ్యాచ్‌.. గుర్తుండిపోయే విజయం’’ అని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి

ఈ అవార్డు అతడికి ఇవ్వాలంటూ ట్రోల్‌
కానీ, ఓ సోషల్‌ మీడియా యూజర్‌ మాత్రం అతడి ఆట తీరును కించపరిచే విధంగా కామెంట్‌ చేశాడు. ఇందుకు ఘాటుగా స్పందించిన అశ్విన్‌ తనదైన శైలిలో అతడికి కౌంటర్‌ ఇచ్చాడు. కాగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 33.4 ఓవర్‌లో మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో అశూ ఇచ్చిన క్యాచ్‌ను మొమినుల్‌ జారవిడిచాడు. 

దీంతో లైఫ్‌ పొందిన అశూ ఇలా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో సదరు యూజర్‌.. ‘‘నీకు వచ్చిన ఈ అవార్డును నిజానికి మొమినుల్‌ హక్‌కు ఇవ్వాలి అశ్విన్‌. అతడే కదా నువ్వు ఇచ్చిన సులువైన క్యాచ్‌ను డ్రాప్‌ చేసింది.

నోరు మూయించిన అశ్విన్‌
ఒకవేళ అతడు క్యాచ్‌ పట్టి ఉంటే.. ఇండియా 89 పరుగులకే ఆలౌట్‌ అయ్యేది’’ అని కామెంట్‌ చేశాడు. ఇందుకు స్పందించిన అశ్విన్‌.. ‘‘ఓహ్‌ నో! నేను నిన్ను బ్లాక్‌ చేశా అనుకున్నానే! సారీ నువ్వు కాదా? అతడు వేరే వ్యక్తి అయి ఉంటాడు. 

అతడి పేరు ఏదో ఉండే! యెస్‌.. డానియల్‌ అలెగ్జాండర్‌... గుర్తొచ్చింది. ఒకవేళ ఇండియా క్రికెట్‌ ఆడకపోయి ఉంటే.. మీ ఇద్దరి పరిస్థితి ఏమయ్యేదో కదా’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు జతచేశాడు. కాగా అశ్విన్‌ను కామెంట్‌ చేసిన ఆ ట్విటర్‌ యూజర్‌ పేరు నబ్రాజ్‌ రంజాన్‌. తన అకౌంట్‌లో ఉన్న బయో ప్రకారం.. శ్రీలంకకు చెందిన అతడు క్రికెట్‌ రైటర్‌, డైలీక్రికెట్‌ఎస్‌ఎల్‌ అడ్మినిస్ట్రేటర్‌. ఈ నేపథ్యంలో అశ్విన్‌ ఇలా అతడికి దిమ్మతిరిగేలా బదులిచ్చాడు.

చదవండి: KL Rahul: రాహుల్‌ వరుస సెంచరీలు చేయాలి! లేదంటే కష్టమే!.. గిల్‌కు అన్యాయం చేసినట్లే కదా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement