
Bangladesh vs India, 1st Test- RIshabh Pant: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లలో విఫలమై విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆకట్టుకున్నాడు. ఛటోగ్రామ్ వేదికగా బుధవారం మొదలైన టెస్టు మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 46 పరుగులు సాధించాడు.
అయితే, 31.4 ఓవర్ వద్ద అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న పంత్‌ను మెహదీ హసన్ మిరాజ్ అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లాతో మ్యాచ్‌లో పంత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇదిలా ఉంటే.. మొదటి రోజు ఆటలో భాగంగా పంత్ అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
50 సిక్సర్లు
31.3వ ఓవర్లో మిరాజ్ వేసిన లో ఫుల్‌టాస్ బంతి పంత్ డీప్ వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. తద్వారా టెస్టుల్లో వేగవంతంగా 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.
ధోని తర్వాత పంత్ మాత్రమే!
అదే విధంగా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ జాబితాలో పంత్ కంటే ముందున్నాడు.
►535 మ్యాచ్‌లు ఆడిన ధోని మొత్తంగా 17092 పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. వీటిలో 15 సెంచరీలు, 108 అర్ధ శతకాలు ఉన్నాయి.
►మరోవైపు.. ధోని వారసుడిగా పేరొందిన రిషభ్ పంత్.. ఇప్పటి వరకు ఆడిన 128 మ్యాచ్‌లలో 4021 పరుగులు సాధించాడు. వీటిలో వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ 3651 రన్స్(109 మ్యాచ్‌లు) తీశాడు. ఇందులో ఆరు శతకాలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: FIFA WC 2022 Final: ఫైనల్ చేరాం చాలు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు! అంబరాన్నింటిన సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment