కంగ్రాట్స్‌ ప్రసీద్‌ కృష్ణ: మెక్‌గ్రాత్‌ | IND Vs ENG Glenn McGrath Congratulates Prasidh Krishna Got Call Up ODIs | Sakshi
Sakshi News home page

ప్రసీద్‌ కృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన మెక్‌గ్రాత్

Published Mon, Mar 22 2021 4:02 PM | Last Updated on Mon, Mar 22 2021 4:34 PM

IND Vs ENG Glenn McGrath Congratulates Prasidh Krishna Got Call Up ODIs - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడనున్న భారత జట్టులో చోటు దక్కించుకున్న ప్రసీద్‌ కృష్ణకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ శుభాకాంక్షలు తెలిపాడు. సిరీస్‌లో మెరుగ్గా రాణించి, గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్‌ చెబుతూ ప్రసీద్‌ కృష్ణ ఫొటో షేర్‌ చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్‌ అతడిని అభినందించాడు. కాగా మార్చి 23 నుంచి టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫాస్ట్‌బౌలర్‌ ప్రసీద్‌ కృష్ణకు ప్రాబబుల్స్‌లో చోటు కల్పిస్తున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అతడితో పాటు రెండో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌కు కూడా అవకాశం కల్పించింది. 

కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున మూడు సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించిన ప్రసీద్‌ కృష్ణకు ప్యాట్‌ కమిన్స్‌, లాకీ ఫెర్గూసన్‌ వంటి మేటిగాళ్లతో కలిసి ఆడాడు. ఇక ఇటీవల ముగిసిన విజయ్‌ హజారే ట్రోఫీలో 6 మ్యాచ్‌లు ఆడిన ఈ కర్ణాటక ఆటగాడు, మొత్తంగా 14 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలో అతడికి అంతర్జాతీయ వన్డేల్లో ఆడే అవకాశం లభించింది.

ఇక తాను సెలక్ట్‌ అయ్యాయని తెలియగానే.. ‘‘దేశం తరఫున ఆడేందుకు పిలుపు రావడం.. ఒక వింత అనుభూతినిచ్చింది. నా కల నిజమైంది. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకు అవకాశం కల్పించిన బీసీసీఐకి ధన్యవాదాలు. ఇంక నేను ఎదురుచూడలేను. తొందరగా సిరీస్‌ ఆరంభమైతే బాగుండు’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇక పుణె వేదికగా మార్చి 23, మార్చి 26, మార్చి 28 తేదీల్లో టీమిండియా- ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌ జరుగనుంది.

చదవండి: ఇంగ్లండ్‌ ఓడినా.. మలాన్‌ నయా రికార్డు లిఖించాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement