విండీస్‌తో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌తో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డు నెలక్పొనున్నాడు. ట్రినిడాడ్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌తో కోహ్లి తన అంతార్జతీయ కెరీర్‌లో 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. ప్రపంచ క్రికెట్‌లో అతి కొద్ది మంది మాత్రమే 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల మైలురాయిని అధిగమించారు. విండీస్‌తో రెండో టెస్ట్‌లో బరిలోకి దిగడం ద్వారా ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా కోహ్లి రికార్డుల్లోకెక్కనున్నాడు.
500 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్‌లు) అందరి కంటే ముందుండగా.. జయవర్ధనే (652), సంగక్కర (594), జయసూర్య (586), రికీ పాంటింగ్ (560), ధోని (538), షాహిద్ అఫ్రిది (524), జాక్ కలిస్ (519), ద్రవిడ్ (509) వరుసగా 2 నుంచి 9 స్థానాల్లో ఉన్నారు. ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 75 శతకాల సాయంతో 25461 పరుగులు చేయగా.. టాప్‌లో ఉన్న సచిన్ 664 మ్యాచ్‌ల్లో 100 సెంచరీల సాయంతో 34357 పరుగులు చేశాడు. అలాగే సచిన్ 201 వికెట్లు కూడా పడగొట్టాడు.
ఇదిలా ఉంటే, డోమినికా వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ (171), కెప్టెన్ రోహిత్ శర్మ (103) సెంచరీలతో కదం తొక్కగా.. అశ్విన్ 12 వికెట్లతో చెలరేగాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకు పరిమితం కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి టెస్ట్ గెలుపుతో 2 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment